ఫుల్ స్వింగ్‌లో ‘స్పైడర్’ బిజినెస్

Mahesh AR Murugadass Spider firstlook released

 

Mahesh AR Murugadass Spider firstlook released

టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్‌ ఎఆర్ మురుగదాస్, మహేశ్ బాబులు తెరకెక్కిస్తున్న సినిమా స్పైడర్. టైటిల్ విషయంలో ఇప్పటికే అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరికి స్పైడర్ టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేగాక మహేశ్ ఫ్యాన్స్ ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న స్పైడర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. సోషల్ మీడియాలో విడుదలైన స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్‌ అభిమానులకు పండగ వాతావరణాన్ని అందించింది. మహేశ్‌కు జంటగా రకుల్‌ప్రీత్ నటిస్తున్న ఈ సినిమా వంద కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళంలో ఒకేసారి ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో వస్తున్న స్పైడర్‌కు హరీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మరోవైపు మహేశ్ స్పైడర్‌కి మొదటి నుంచీ క్రేజ్ ఏర్పడింది. సినిమా షూటింగ్‌లో ఉండగానే ఫుల్ హైప్ ఉండడంతో ఓవర్సీస్ బిజినెస్ కూడా బాగా పెరిగింది. వంద కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 150 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. నైజాం ఏరియా హక్కులు 20 కోట్లకి, ఆంధ్రా – సీడెడ్ హక్కులు 36 కోట్లకి, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లకి పైగా అమ్ముడైనట్టు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక తమిళంలో ఈ సినిమా 28 కోట్లకి అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఈ సినిమా 150 కోట్ల వరకూ బిజినెస్ చేయవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Mahesh AR Murugadass Spider firstlook released

Have something to add? Share it in the comments

Your email address will not be published.