జీఎస్టీ దెబ్బతో రజినీ, ప్రభాస్‌ బాటలో మహేశ్‌

Mahesh Spyder chooses Rajinikanth and Prabhas path in cinemas

తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న సినిమా స్పైడర్. బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ అయి గ్యాప్ తీసుకొని, అప్పటికే మంచి హిట్లతో ఊపుమీదున్న మల్టీ లింగ్వల్ డైరెక్టర్ మురుగదాస్‌తో కలిసి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ చేస్తున్న స్పైడర్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఫస్ట్‌లుక్‌తోనే ట్రెండ్ క్రియేట్ చేసి అభిమానుల గుండెల్లో తన స్థానానికి ఢోకాలేదని నిరూపించుకున్న మహేశ్ ఇప్పుడు రజినీకాంత్, ప్రభాస్‌ల బాటలో నడవాలని డిసైడ్ అయ్యాడు.

Mahesh Spyder chooses Rajinikanth and Prabhas path in cinemas

అందుకే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ చివరి దశకు చేరుకున్న స్పైడర్ సినిమాకు సంబంధించి ఒక్క పాట మినహా దాదాపు షూటింగ్ పూర్తయింది. అంతేగాక ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రభాస్‌ దారిని మహేశ్‌ వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. బాహుబలి తర్వాత స్పైడర్ ఇప్పుడు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.

మహేశ్ కెరీర్‌లోనే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా స్పైడర్ భారీ ఎత్తున రిలీజ్‌కు సిద్ధమౌతోంది. హిందీలో ఏఏ ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పైడర్‌ను రిలీజ్ చేస్తుండగా, తమిళంలో మురుగదాస్ సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే  ఈ సినిమా బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలోనే జరుగుతోంది. ఈ సినిమా రైట్స్‌లను ఫ్యాన్సీ రేటుకు అమ్మాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

See Also: ఫుల్ స్వింగ్‌లో ‘స్పైడర్’ బిజినెస్

అయితే భారీగా సొమ్ము చేసుకోవాలన్న నిర్మాతల ఆశలపై జీఎస్టీ నీళ్లు జల్లినట్టు తెలుస్తున్నది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా స్పైడర్ సినిమా బిజినెస్‌పై తీవ్ర ప్రభావం పడినట్టు టాక్ నడుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు జరుగబోయే బిజినెస్ వల్ల వచ్చే ఆదాయంలో 10 శాతం కోతపడే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు స్పైడర్ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్‌ను ఆగస్టులో నిర్వహించనున్నారు.

అంతేగాక స్పైడర్ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇప్పటికే బరిలో ఉన్న పెద్ద సినిమాలు బాలయ్య నటిస్తున్న పైసా వసూల్, ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలను ఢీ కొట్నటడానికి మురుగదాస్, మహేశ్‌లు సిద్ధమయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.