మహేష్‌తో బాలీవుడ్ భామ

Mahesh to pair with Kiara Advani for Koratala Siva project
Mahesh to pair with Kiara Advani for Koratala Siva project
టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబు‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది ఓ బాలీవుడ్ భామ. ప్రస్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. జనతా గ్యారేజ్‌తో హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న కొరటాల శివతో సినిమాకు సిద్ధమయ్యాడు మిల్కీ బాయ్. మురుగుదాస్ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరుకల్లా సినిమా పూర్తయిన వెంటనే కొరటాల సినిమా షెడ్యూల్ మొదలవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది.
ఈసారి మహేశ్ సరసన బాలీవుడ్ భామను తీసుకురావాలని కొరటాల అనుకుంటున్నారట. దీనికోసం ధోని సినిమాలో నటించిన కైరా అద్వానీకి అవకాశం దక్కిందని సమాచారం. మహేశ్ సినిమాతో కైరా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోందట. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మే మొదటివారంలో లాంఛనంగా ప్రారంభించి జూన్‌లో షెడ్యూల్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు భరత్ అనే నేను టైటిల్ పరిశీలనలో ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.