డ్రగ్ రాకెట్‌లో బయటపడాల్సిన పేర్లు ఎన్నో..??

Major Drug Racket bursted in Hyderabad as police arrested 3 accused

డ్రగ్ రాకెట్లకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో పోలీసులు వలపన్ని ఈసారి పెద్ద డ్రగ్స్ దందా‌ను బట్టబయలు చేశారు. ఇప్పటికి ఎన్నోసార్లు పోలీసులు పట్టుకోవడం.. కొన్ని రోజులు అంతా సైలెంట్ అయిపోవడం మళ్ళీ దందా మొదలుపెట్టడం అనేది హైదరాబాద్‌లో తంతుగా మారింది. ఈసారి హైదరాబాదులో పట్టుకున్న డ్రగ్ రాకెట్‌లో 21 మంది విఐపిలకు లింక్స్ ఉన్నాయని వాళ్ళలో సినీ నిర్మాతలు కూడా ఉన్నారని అంచనాకు వస్తున్నారు పోలీసులు.

Major Drug Racket bursted in Hyderabad as police arrested 3 accused

అత్యంత రహస్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని ఓ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. బోయినపల్లిలో చేసిన దాడిలో స్మగ్లర్లనుంచి 22 లక్షలకు పైగా విలువ చేసే డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పుస్తకాలు, అత్యవసర మందుల రూపంలో షికాగో నుంచి మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకుంటూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. విద్యార్థుల పుస్తకాలు, ప్రాణావసర మందులు కావటంతో పోలీసులు సైతం పెద్దగా అనుమానించేవారు కాదని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు.

See Also: వీడికిదేం నోటి దూల: RGV కి పోటీ అవుతున్నాడుగా

పాతబోయినపల్లి రాజారెడ్డి కాలనీలో ప్లాట్‌నెంబరు 28లో నివాసం ఉంటున్న డ్రగ్స్ రాకెట్ కీలక సూత్రధారి కెల్విన్‌ మెకనాస్‌ (29) మ్యూజీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతను చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ ఖుద్దూస్‌(29), మహ్మద్‌ అబ్దుల్‌ వాహెద్‌(20)తో కలసి బోయినపల్లిలో డ్రగ్స్‌ దందా మొదలుపెట్టాడు. అత్యంత ఖరీదైన లిసర్జిక్‌ యాసిడ్‌ డైథ్లోమైడ్‌ (ఎల్‌ఎస్‌డీ) బ్లాట్స్‌, మెథలిండియోక్సి మెథియాంఫిటోమైన్‌ (ఎండీఎంఏ) అనే డ్రగ్స్‌ను వీళ్ళు ముగ్గురు సరఫరా చేస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాతలతో కూడా ఈ గ్యాంగుకు సంబంధాలు ఉన్నాయని, వాటి వివరాలు రాబట్టే పనిలో ఉన్నామని అకున్‌ సభర్వాల్‌ తెలిపారు.

Major Drug Racket bursted in Hyderabad as police arrested 3 accused

ఈ కేసులో 21 మంది విఐపిలకు సంబంధాలున్నాయని ఒక అంచనాకు వచ్చి వాళ్ళలో 9మందిని ప్రశ్నించినట్లు కూడా తెలిపారు. అంతేగాక నిందితుల నుంచి 700 ఎఎల్‌ఎస్‌డీ డాట్స్‌, బ్లాట్స్‌, 35 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ సరఫరాకు నిందితులు టెక్నాలజీని ఉపయోగించారని, తమ కస్టమర్లకు సరుకు ఎక్కడ ఇస్తామో ఎస్‌ఎంఎస్‌ చేసే స్మగ్లర్లు తాము పంపిన మెసేజ్‌ పది నిమిషాల్లో అవతలి వారి ఫోన్‌ నుంచి డిలీట్‌ అయిపోయేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారని తెలిపారు.

ఈ ముగ్గురి దగ్గర బడా వ్యాపారులేకాకుండా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు సైతం డ్రగ్స్ తీసుకొనేవారని పోలీసులు చెబుతున్నారు.

See Also: ర్యాంకు మెరుగుపడకపోతే నో టికెట్: చంద్రబాబు

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.