ఆ నటుడి విషయంలో కారణం అది కాదట

Malayalam Actor Dileep says Kavya Madhavan was not the reason behind my divorce with Manju warrier

Malayalam Actor Dileep says Kavya Madhavan was not the reason behind my divorce with Manju warrier                              

మలయాళ సినీ ప్రముఖుడు దిలీప్.. నటి మంజూ వారియర్ లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరి మధ్య విడాకుల విషయానికి సంబంధించి ఆసక్తికర అంశాన్ని చెబుతుంటారు. ఈ మధ్యనే దిలీప్ పెళ్లి చేసుకున్న నటి కావ్యతో ఉన్న ఎఫైర్తోనే మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లుగా పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. అది ఉత్త పుకారే కానీ.. అందులో ఎలాంటి నిజం లేదని చెబుతారు దిలీప్. తాజాగా ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చారాయన. 

1998లో  దిలీప్ కి మంజూవారియర్ తో వివాహం జరిగింది. ఆ తర్వాత.. కొంతకాలం వీరి మధ్య వివాహబంధం సాఫీగా సాగినప్పటికీ.. తర్వాతి కాలంలో వారిద్దరి మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీంతో.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఇదిలా ఉండగా 2015 జనవరిలో వీరిద్దరికి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2016 నవంబరులో నటి కావ్యను దిలీప్  వివాహమాడారు. ఆ వివాహం కి సంబంధించి పలు రూమర్స్ వచ్చాయి .  కావ్య కోసమే మంజూకి విడాకులు ఇచ్చాడని ప్రచారం చేసారు. కాని మంజూవారియర్తో విడాకులు.. కావ్య కోసమేనన్న వాదన నిజం కాదని.. తనకు ఆ ఉద్దేశమే లేదని చెప్పాడు దిలీప్ . తామిద్దరం ఎవరి దారిలో వారు ప్రయాణిస్తున్నామని..  ఎవరి బతుకులు వారు బతుకుతున్నామని.. మంజూతో ముగిసిపోయిన అధ్యాయంగా పేర్కొన్న ఆయన.. తానుచాలా సందర్భాల్లో మౌనాన్ని ఆశ్రయించేవాడినని పేర్కొన్నారు.

తాను చాలామందిని నమ్మానని.. చాలాసార్లు మోసపోయానని.. ప్రతిసారీ మౌనం పాటించేవాడినని చెప్పిన దిలీప్.. తన కుమార్తె ఫ్యూచర్ కోసం తానెంతో ఆలోచించేవాడినని చెప్పారు.మొత్తానికి తన రెండో పెళ్లి కోసమే మొదటి పెళ్లి విడాకులకు వెళ్ళలేదు అని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. విడాకులు వచ్చిన కొద్దికాలానికే.. బయట వినిపించిన గుసగుసలకు తగ్గట్లే రెండో పెళ్లి జరగటం గమనార్హం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.