జన్మతహా హిందువునే కానీ హానికారక హిందూత్వను సహించను: మమతా బెనర్జీ

Mamata slams BJP over Puri temple visit I don't indulge in Hindutva that maligns Hindus as i am a born Hindu

Mamata slams BJP over Puri temple visit I don't indulge in Hindutva that maligns Hindus as i am a born Hindu

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒడిశా పూరిలోని ప్రఖ్యాత జగన్నాథ దేవాలయాన్ని దర్శించుకున్నారు. బెంగాలీలకు పూరి జగన్నాథుడంటే చాలా ఎక్కువ నమ్మకమని ప్రతీ యేడాది పూరీకి వచ్చే భక్తుల్లో బెంగాలీలు ఎక్కువగా ఉంటారని గుర్తుచేశారు. గతంలో ‘హిందువులు కూడా గొడ్డుమాంసం తినొచ్చు’ అన్న మమత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ దాని అనుబంధ సంఘాలు రచ్చచేయడంపై మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జన్మతహా తాను హిందువునేనని అయితే హిందువులను అపఖ్యాతిపాలుచేసే బిజెపి తరహా హిందుత్వ ధోరణిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోనని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన తర్వాత జగన్నాథుడి దర్శనం చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చని తనకు మాత్రం జగన్నాథుడిపట్ల విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు మమతా బెనర్జీ. హిందూ మతం చాలా గొప్పదని, అందరినీ కలుపుకునే తత్వం దానిలో ఉందని మమత గుర్తు చేశారు.

ఒడిశా వచ్చిన మమతకు వ్యతిరేకంగా బీజేపీ యువ మోర్ఛా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. గోమాంస భక్షణను సమర్థించిన మమతను ఆలయంలో అడుగుపెట్టనియ్యబోమని పూరి సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టిన బీజేపీ కార్యకర్తలనుపోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.