ఈ గడ్డ మీద పుట్టినందుకు సిగ్గుపడుతున్నా: మమతా బెనర్జీ

Mamatha Banrjee Sensational comments on religious intolerance in India

Mamatha Banrjee Sensational comments on religious intolerance in India

 

ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మమతా బెనర్జీ తన బాధను వెళ్ళగక్కారు. ఈ గడ్డపై పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చిన మమతా దీదీ, మన దేశంలో మత సహనంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో అన్ని మతాలవారు కలిసికట్టుగా ఉంటూ శాంతియుతంగా ఉండాలే తప్ప కత్తులతో పక్కవాళ్ళను బెదిరించి కాదని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా ఇలాంటి పరిస్థితులున్న ఈ గడ్డపై పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని ఘాటుగా తన భావాలను వ్యక్తపరిచారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

అయితే మమతా బెనర్జీ కామెంట్లపై సోషల్ మీడియాలో పెద్ద దుమారానికే తెరలేచింది. అంత బాధ పడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు ఇక్కడెందుకు ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.