ఈ నెల 27న  “మనసైనోడు” చిత్రo ఆడియో

Manasainodu audio release on June 27th
H-PICTURES పతాకం పై మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్ గా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వకంలో హసీబుద్దిన్ నిర్మాతగా “మనసైనోడు” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం శరవేగం గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుoది.ఈ నెల 27న ఆడియో విడుదల చేసి జూలై లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలియజేసారు.
Manasainodu audio release on June 27th
దర్శకుడు సత్యవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… మనోజ్ నందన్, ప్రియసింగ్ జంట చూడముచ్చటగా ఉoటుoదని, ఈ చిత్రoలో ఆరు పాటలకు సుభాష్ ఆనంద్ చక్కని సoగీతం అందిoచారు. “జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత” అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తీ గీతాన్ని స్వర్గీయ డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారు రచిoచారు.మగవాళ్ళ జీవితాల్లో ఆడవాళ్ళ లేకపోతే ఎంత నష్టమో కాస్త చిలిపిగా ఒక పాటను భాస్కరబట్ల రచిoచారు.ప్రేమ కధలో  కుటుంబ కధని జోడించి దేశానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా దేశభక్తిని యువకుల్లో నింపే విధంగా రూపుదిద్దుకున్న చిత్రం.“ మనసైనోడు” అని అన్నారు.
నిర్మాత హసీబుద్దిన్ మాట్లాడుతూ..ఒక మంచి చిత్రాన్ని నిర్మిoచినoదుకు చాలా సంతోషం గా వుంది. ఈ చిత్రం అనుకున్న విధంగా జూలై లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్త్తున్నాం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.