మోహన్‌బాబు పుట్టినరోజునే ‘ఆచారి అమెరికా యాత్ర’

కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకంలాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూడో సినిమా “ఆచారి అమెరికా యాత్ర”. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ముఖ్యపాత్ర చేస్తున్న ఈసినిమాను  పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి19న డా.మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా “ఆచారి అమెరికా యాత్ర” మూవీ ప్రారంభోత్సవం తిరుపతిలో జరగనుంది.

ఆచారి అమెరికా యాత్ర సినిమా నిర్మాతలు మాట్లాడుతూ ‘దర్శకుడు నాగేశ్వర్‌‌రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ విశేషంగా అలరిస్తుంది. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి కథను సమకూర్చారు. మార్చి19న లాంఛనంగా సినిమా మొదలవుతుంది. నటీనటులు మరియు ఇతర సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది.” అన్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.