‘చెలియా’ కార్తీ స్టామినాను బయటపెడ్తుందా?

Maniratnam Kaarthi emotional love drama cheliyaa is ready to release on April 7th

Maniratnam Kaarthi emotional love drama cheliyaa is ready to release on April 7th

సున్నితమైన అంశాలను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకుల్లో ప్రధానంగా వినిపించే పేరు మణిరత్నం. మణి అంటేనే ఓ బ్రాండ్. ఆయన సినిమాల్లో చాలా అంశాలను కలగలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. మణిరత్నం దర్శకత్వానికి ఎఆర్ రెహమాన్ సంగీతంతోడైతే ఎలాంటి కళాఖండాలు దర్శనమిస్తయో వేరే చెప్పక్కర్లేదు. రోజా ,దిల్ సే, బొంబాయి వంటి సినిమాల్లో లవ్, రొమాన్స్, టెర్రరిజంలాంటి  అంశాలకు రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమా రేంజ్‌ని పెంచేశారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ సినిమా ‘కాట్రు వెళియిడై’.

మద్రాసు టాకీస్ బ్యానర్‌లో తమిళ హీరో కార్తీ, బాలీవుడ్‌ భామ అదితీరావు హైదరీ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లొో ఏప్రిల్7న విడుదల చేస్తున్నారు.

తమిళం, తెలుగు ఇండస్ట్రీల్లో అన్న సూర్యకు పోటీగా మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన సినిమాలతో  స్టామినాను నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న కార్తీ చెలియా అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఒక ట్రైలర్‌ను విడుదల చేసిన టీం ఈ రోజు హైదరాబాద్‌లో చెలియా ఆడియో రిలీజ్ చేయడంతోపాటు కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.

నీట్ షేవ్‌లో క్లాస్‌గా చూపిస్తూనే కొన్ని షాట్లలో తీవ్రవాదిలా కనిపించే కార్తీ అదితిరావ్ హైదర్‌తో రొమాన్స్ చేయడం కొత్త ట్రైలర్‌లో కనిపిస్తోంది.  దీంతో ఈ సినిమా కేవలం రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏమాత్రం కాదని ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా కనిపించే కార్తీ తీవ్రవాదిలా ఎందుకు కనిపించాడు అన్న సస్పెన్స్ రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. హీరో ఆర్మీ ఆఫీసర్‌ కమ్‌ పైలట్, హీరోయిన్‌ డాక్టర్‌. యుద్ధం నేపథ్యంలో లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తీశారట. కార్తీ తీవ్రవాదిలా కనిపిస్తున్న లుక్స్ సినిమా మీద అంచనాలను డబుల్ చేస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.