ఢిల్లీలో ఎగిరిన కాషాయ పతాకం

MCD polls: BJP wins and sinks AAP, Congress in Delhi

MCD polls: BJP wins and sinks AAP, Congress in Delhi

ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికల్లో అందరూ ఊహించిందే జరిగింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను నిజం చేస్తూ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను బిజెపి కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌ రెండోస్థానంతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తం మూడు కార్పోరేషన్లలో 270 వార్డులకు ఎన్నికలు జరగ్గా అన్నింటిలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి భాజపా కాషాయ జెండా ఎగురవేసింది.

ఏప్రిల్‌ 23న తూర్పు ఢిల్లీ కార్పొరేషన్‌లోని 63, ఉత్తర ఢిల్లీలోని 103, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌లోని 104 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మూడు కార్పొరేషన్లలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటిన బిజెపి మరోసారి ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ) భాజపా వశమైంది. అంతేగాక అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భాజపా ఓట్ల శాతం కూడా పెరిగింది.

 

MCD polls: BJP wins and sinks AAP, Congress in Delhi

మోదీ పాలనకు దిల్లీ ప్రజలు పట్టం కట్టారని, రెండేళ్ల ఆప్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారని అమిత్‌ షా అన్నారు. ఈవీఎంల వల్లే ఓడిపోయామని ఆప్‌ చేస్తున్న వ్యాఖ్యలను అమిత్‌ షా ఖండించారు. 2015 ఎన్నికల్లో ఈవీఎంల వల్ల అధికారంలోకి వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌… ఇప్పుడు ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. విమర్శల రాజకీయాలను దిల్లీ ప్రజలు తిరస్కరించారని.. విమర్శలతో ఆప్‌ తన గొయ్యి తానే తవ్వుకుందని విమర్శించారు.

మరోవైపు ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మాజీ కేంద్రమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.