హిట్ కొట్టడానికి రెడీ అయిన ‘మిస్టర్’

Mega Prince Varuntej ready to take hit with Srinu vaitla Mister

Mega Prince Varuntej ready to take hit with Srinu vaitla Mister

లోఫర్ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్‌తో డైలమాలో పడ్డ వరుణ్‌‌తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన సినిమా మిస్టర్ విడుదలకు రెడీ అయ్యింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మిస్టర్‌తో వరుణ్‌తేజ్ కెరీర్‌లో దూసుకుపోతాడని అంటున్నారు విశ్లేషకులు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు నిర్మాతలుగా  శ్రీను వైట్ల దర్శకత్వంలో లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌లు హీరోయిన్లుగా తెరకెక్కిన మిస్టర్ హిట్ కొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా రాలేదని, ట్రావెల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో కూడా చిత్ర యూనిట్ దూసుకుపోతుండడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.  మిస్ట‌ర్ సినిమా విషయంలో మెగా అభిమానులు ఎంత ఆశ‌లు పెట్టుకున్నారో దానికి రెట్టింపు ఆశలు డైరెక్టర్ శ్రీనువైట్ల పెట్టుకున్నాడు.

Mega Prince Varuntej ready to take hit with Srinu vaitla Mister

ఇప్పటివరకు శ్రీనువైట్ల చేసిన సినిమాలన్నీ ఒకఎత్తైతే మిస్టర్ సినిమా నుండి అతని కెరీర్ గ్రాఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందని అంటున్నారు. రెండు సినిమాలు పరాజయంపాలవడంతోపాటు ఇండస్ట్రీలో ఎన్నో ఆటంకాలు , అవ‌మానాల మ‌ధ్య‌ త‌న‌ని తాను అప్‌డేట్ చేసుకుని మారి కొత్త టీంతో చేసి సినిమా మిస్టర్.

మరోవైపు వరుణ్‌తేజ్ టెన్షన్ పడుతున్నాడోలేదోకానీ నాగబాబు మాత్రం కాస్త టెన్షన్‌గానే ఉన్నారట. మిస్టర్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోన‌నే టెన్షన్‌ ఎలాగూ ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు మిస్టర్ సినిమా మొత్తం ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీలో ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినన్ని ట్విస్ట్‌లతో పాటు ఒక్క సీన్ కూడా బోర్ కొట్ట‌కుండా తీసామ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

Mega Prince Varuntej ready to take hit with Srinu vaitla Mister1

అంతేగాక వ‌రుణ్ కు కంచె‌తో వ‌చ్చింది గుర్తింపే త‌ప్ప సూప‌ర్ హిట్ అయితే కాదు కాబట్టి మిస్ట‌ర్ అతనికి ఫ‌స్ట్ మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అవుతుందని మెగా ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ ఇద్దరికీ యూత్‌లో ఉన్న మంచి ఫాలోయింగ్ సినిమాకి ప్లస్ అవుతందనే టాక్ వినిపిస్తోంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.