దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది: చిరంజీవి

Mega Star Chiranjeevi appreciates dadasaheb phalke awardee K.Vishawanath at his residence
Mega Star Chiranjeevi appreciates dadasaheb phalke awardee K.Vishawanath at his residence
కళాతపస్వికి అభినందలనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసి అభినందిస్తున్నారు.  ఈరోజు మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
చిరంజీవి మాట్లాడుతూ `నాకు విశ్వ‌నాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని కాకుండా కుటంబ ప‌రంగాను మంచి రిలేషన్ ఉంది. ఆయ‌న‌కు ఈ అవార్డు రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతికి లోన‌వుతున్నా. అవార్డు రావాల్సిన స‌మ‌యంలో వ‌చ్చిందా? లేదా అన్న దానిపై ఇప్పుడు మాట‌లు అన‌వ‌స‌రం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వ‌రించాల్సింది. కానీ కాస్త ఆల‌స్య‌మైన అవార్డు ఆయ‌న్ను వ‌రించ‌డం సంతోషంగా ఉంది.
Mega Star Chiranjeevi appreciates dadasaheb phalke awardee K.Vishawanath at his residence
‘ఆయ‌న ఎలా ఫీల్ అవుతున్నారో తెలియ‌దు గానీ, మేము మాత్రం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఆయ‌న‌కు అవార్డు రావ‌డం తో ఆ అవార్డుకు నిండుద‌నం వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా శుభాబివంద‌నాలు తెలుపుతున్నా. ఎప్ప‌టికీ ఆయ‌న ఆశీస్సులు కోరే మ‌నిషినే..ఆయ‌న చిరంజీవినే` అని అన్నారు.
Mega Star Chiranjeevi appreciates dadasaheb phalke awardee K.Vishawanath at his residence 4

Have something to add? Share it in the comments

Your email address will not be published.