‘ఉయ్యాలవాడ’ కోసం కసరత్తు చేస్తున్న మెగాస్టార్

Megastar Chiranjeevi doing preparations for his 151 movie Uyyalavada Narasimha Reddy

Megastar Chiranjeevi doing preparations for his 151 movie Uyyalavada Narasimha Reddy

151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి అప్పుడే సన్నాహాలు ప్రారంభించాడు. దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో తొలి సమర యోదుడైన ఉయ్యాలవాడ పాత్రలో లీనమయ్యేందుకు చిరు శ్రమిస్తున్నాడు. గుర్రపు స్వారీ, కత్తియుద్ధంలో ట్రైనింగ్ పొందుతున్న మెగాస్టార్ ఇందుకోసం రోజూ హైదరాబాద్ రేస్ కోర్సు ను విజిట్ చేస్తున్నాడని మూవీ యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఉయ్యాల వాడకోసం చిరంజీవి కసరత్లు బాగా చేస్తున్నాడు.హార్స్ రైడింగ్ లో చిరుకు ఇదివరకే ఎక్స్ పీరియెన్స్ ఉన్నా గ్యాప్ చాలా కాలం వచ్చింది గనుక శిక్షణ తప్పనిసరైందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి మార్షల్ ఆర్ట్స్ లోనూ ట్రైనింగ్ తీసుకుంటాడని అంటున్నారు. అటు-ఈ సినిమాకు కథ, మాటలు రాస్తున్న పరుచూరి బ్రదర్స్ ..ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన సమాచారాన్నంతా సేకరిస్తున్నారట. చరిత్రకారులను, మేధావులను సంప్రదిస్తున్నారని అంటున్నారు.

ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథకు సంబంధించిన రచనలు, నవలలు గానీ అచ్చు రూపంలో ఉన్న దాఖలాలు కనిపించినట్టు లేవు. రాయలసీమలో కొందరు చెప్పుకొనే కథనే ఉయ్యాలవాడకు ఆధారం. అయితే రాయలసీమ ప్రజలకు, యువతకు ఉయ్యాలవాడ జీవితం ఓ స్ఫూర్తి. ఉయ్యాలవాడను రాయలసీమ ప్రాంతం వాళ్లు విపరీతంగా అభిమానిస్తారు.

సైనిక తిరుగుబాటుకు దాదాపు 10 సంవత్సరాల ముందే అంటే సుమారు 1847 కాలంలోనే ఉయ్యాలవాడ కథ జరిగినట్లు చరిత్ర చెపుతున్నది. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వల్ల తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు అనంతరపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నర్మించిన కోటలు నగరులు ఈనాటికీ ఉన్నాయి.మరి జనం మరిచిపోయిన ఆ మహా వ్యక్తి గురించి మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా చూపిస్తాడో చూడాలి మరి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.