ప్రభుత్వానికి ఆదాయం వస్తే విషం కూడా హెల్తీ డ్రింకే..

Minister Jawahar Controversial comments on Beer healthy Drink

ప్రభుత్వానికి ప్రముఖ ఆదాయ వనరుగా ఉన్న మద్యంపై ఎప్పటికప్పుడు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఒకవైపు మద్యంషాపులు ఎత్తేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తుంటే మరోవైపు ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే విషాన్ని కూడా హెల్తీ డ్రింక్ అని చెప్పి అమ్ముతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Minister Jawahar Controversial comments on Beer healthy Drink

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడుగానీ, ఏదైనా విషయంపై వ్యాఖ్యలు చేసేటప్పుడుకానీ ఒళ్ళు దగ్గరపెట్టుకొని చేయకపోతే వాళ్ళతో పాటు వాళ్ళని ఆ పదవిలో కూర్చోపెట్టిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెస్తున్నారు. లేటెస్ట్‌గా ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ బీరును హెల్త్ డ్రింక్గా అభివర్ణించి కొత్త వివాదానికి తెరలేపారు. బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేస్తున్నామని ప్రకటించిన ఆయన కావాలంటే బీరు హెల్త్‌ డ్రింక్‌ అని నిరూపిస్తానంటూ సవాల్‌ చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక బీరును హెల్త్ డ్రింక్‌గానే తమ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోందని చెప్పారు.

See Also: ఇదేం పైత్యం కమలనాథా…??

మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడబోమని చెప్పిన మంత్రి మరోవైపు ఫుల్‌గా మద్యం తాగించేందుకు బీరును హెల్త్‌‌డ్రింక్‌గా ప్రమోట్‌ చేస్తున్నామని చెప్పడం వివాదానికి తెరలేచినట్లైంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రోడ్ల వెంబడి నగరాల్లో, పట్టణాల్లో మద్యం షాపుల ఏర్పాటు వీలు కాకపోవడంతో రోడ్లను డీ నోటిఫై చేయనున్నామని, బైపాస్‌ రోడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పడానికి వచ్చిన జవహర్ బీరు విషయం ప్రస్తావించి చిక్కుల్లో ఇరుక్కున్నారు.

కొత్తగా తీసుకొచ్చిన మద్యంపాలసీ వల్ల మద్యం అమ్మకాలపై స్పష్టత రాక ఇబ్బందిపడుతున్న ప్రభుత్వాన్ని జవహర్ మరింత టార్గెట్ అయ్యేలా చేశారు. అంతేగాక బీరు హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తానని చెప్పడం పై మహిళా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. బీరులో ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉన్న విష‍యం మంత్రికి తెలీదా అని ప్రశ్నిస్తున్నారు. బీరు తాగడం హానికరం అయితే దాన్ని హెల్త్ డ్రింక్ గా ఎలా నిరూపిస్తారని ఛాలెంజ్ చేస్తున్నారు.

See Also: వర్మ ఇప్పుడేం వివాదాలు బయటపెడ్తాడో..!

Have something to add? Share it in the comments

Your email address will not be published.