భగీరథ ఫలాలు అందిస్తున్నాం: కెటిఆర్

Minister KTR inaugurated HMWSSB water reservoir at Nallagandla under Urban Mission Bhagiradha

Minister KTR inaugurated HMWSSB water reservoir at Nallagandla under Urban Mission Bhagiradha

హైదరాబాద్ న‌గ‌రంలో నీటి స‌మ‌స్య ప‌రిష్కారించ‌డాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని ప్ర‌తి మ‌నిషికి 150 లీట‌ర్ల నీరు ఇవ్వ‌డ‌మే ల‌క్ష్యంగా పనిచేస్తున్నామంటున్నారు మంత్రి కెటిఆర్. రికార్డు స‌మ‌యంలో రిజ‌ర్వాయ‌ర్ల‌ను నిర్మాణం పూర్తి చేస్తున్నామని ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ వర‌కు రిజ‌ర్వాయ‌ర్ల‌న్నీ పూర్తి చేసి హైద‌రాబాద్‌లో సంవృద్ధిగా వ‌ర్షాలు ప‌డితే ప్ర‌తి రోజు నీటి స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు.

12 రిజర్వాయర్లు సిద్ధంగా ఉండగా మొదటి విడతగా గోపన్‌పల్లి, నలగండ్ల, కేపీహెచ్‌బి ఫేజ్-4, హుడా మియాపూర్ ప్రాంతాల్లోని రిజర్వాయర్లను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు అనుకున్న దాని కంటే ముందే ప‌నులు పూర్తి చేసిన అధికారుల‌కు, కాంట్రాక్ట‌ర్ల‌కు, స‌హ‌క‌రించిన ప్ర‌జ‌ల‌ను మెచ్చుకున్నారు.

హైద‌రాబాద్‌లో అద్భుత‌మైన శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్నాయని రాబోయే రోజుల్లో ర‌హ‌దారులు, మూసీ అభివృద్ధి చేయ‌బోతున్నారు కెటిఆర్. 1900 కోట్ల రూపాయలతో 1800 కి.మీ పైపులైన్లు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చిన ఆయన హైద‌రాబాద్‌లో జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు ప్ర‌భుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. ఇప్ప‌టికే హైదరాబాద్‌లోని 160 బ‌స్తీల్లో ప్ర‌తిరోజు నీరు అందిస్తున్నామని, మిష‌న్ భ‌గీర‌థ ఫ‌లాలు హైద‌రాబాద్‌కు అందిస్తున్నామన్నారు. 56 రిజ‌ర్వాయ‌ర్ల‌కు 46 రిజ‌ర్వాయ‌ర్ల‌ను రాబోయే రెండేళ్ల‌లో పూర్తి చేస్తామ‌న్నారు. హైద‌రాబాద్ జ‌నాభా ఐదు రేట్లు పెరిగినా స‌రిపోయేలా 20 టీఎంసీల కెపాసిటీతో శామీర్‌పేట‌లోని కేశ‌వాపూర్ ద‌గ్గ‌ర భారీ రిజ‌ర్వాయ‌ర్ నిర్మిస్తున్నామని తెలిపారు మంత్రి.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.