అధికారులు సహకరించాలి: మంత్రి పరిటాల సునీత

Minister Paritala Sunitha requests officers to Cooperate in Women and Child Welfare Department

Minister Paritala Sunitha requests officers to Cooperate in Women and Child Welfare Department

 

మూడేళ్ళపాటు పౌరసరఫరాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఈమధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణలో స్త్రీ శిశు సంక్షేమశాఖ పొందిన పరిటాల సునీత అధికారులతో సమీక్షలు నిర్వహించారు. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని సెర్ప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి పరిటాల సునీత సమీక్షా సమావేశం  నిర్వహించారు.

ఈ సమీక్షలో సెర్ప్ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, సిఇఒ పి.కృష్ణ మోహన్, అన్ని జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పధకాల గురించి జిల్లాల వారిగా అధికారులతో పరిటాల సునీత చర్చించారు.  అధికారులందరూ కుటుంబ సభ్యులుగా కలిసి పని చెయ్యాలని ఆమె సూచించారు. సెర్ప్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నా అవి వెలుగులోకి రావడంలేదని, అధికారులు పథకాలను ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్ళలేకపోతున్నారని మంత్రి విమర్శించారు.

అంతేగాక పౌరసరఫరాలశాఖలో కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకున్నానని చెప్పిన మంత్రి పరిటాల సునీత అదే స్పూర్తితో ఈ శాఖకు కూడా మంచి గుర్తింపు తెస్తానన్నారు. దానికి అధికారులందరూ తనకు సహకరించాలని కోరుతున్నానని మంత్రి స్పష్టంచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.