నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ ప్రయోగం

minister-pocharam-srinivas-reddy-comments-on-duplicate-seed-business

minister-pocharam-srinivas-reddy-comments-on-duplicate-seed-business

తెలంగాణాలో రుతుపవనాల త్వరలో వస్తుండడం, ఈ యేడాది వర్షాలపై గట్టి నమ్మకం పెట్టుకున్న తెలంగాణా ప్రభుత్వం ఈ యేడాది కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని వ్యవసాయశాఖామంత్రి పోచారం తెలియచేశారు. రైతులకు అన్ని వరాలు ఇస్తున్న సీఎం కేసీఆర్ సాగునీరు పంపిణీపై ప్రత్యేకంగా ద‌ృష్టిపెట్టారని పోచారం తెలిపారు. చెరువులు, ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్‌ మండలాల్లో పర్యటించిన వ్యవసాయశాఖామంత్రి పోచారం నకిలీ విత్తనతయారీదారులు, విక్రేతలపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. రైతు సమగ్ర సర్వే ఇప్పటివరకు 65శాతం పూర్తయిందని, ఈ సర్వేకు అవసరమైతే గడువు పొడిగించనున్నట్టు తెలిపారు. అంతేగాక నకిలీ విత్తనాల వ్యాపారులపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్టు స్పష్టంచేశారు పోచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.