మైనర్ బాలిక ఆస్తి కోసం ఓ పిన్ని అకృత్యం

హైదరాబాద్‌ సాక్షిగా ఓ దారుణం బయటికొచ్చింది. ఆస్తికోసం మన అనుకున్నవాళ్ళే చిత్రహింసలకు గురిచేస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ బాలిక  మానవ హక్కువ కమిషన్‌ను ఆశ్రయించింది. ముంబై కి చెందిన మైనర్ బాలిక అలీనా ఖాన్ ఆస్తి కోసం తన పిన్ని శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తుందంటూ హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.

ఫేసుబుక్  మిత్రుడి సహాయంతో హైదరాబాద్‌కి వచ్చిన బాధిత బాలిక తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత పిన్ని అర్షియ తనను  ముంబై నుండి బెంగళూరు తీసుకెళ్లి… తన కోట్లు విలువ చేసే ఆస్తిని కాజేయ్యడానికి గత రెండు సంవత్సరాలుగా తీవ్రంగా హింసిస్తోందంటూ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.. తనకు పిన్ని అర్షియానుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ  హెచ్చార్సీని బాలిక వేడుకుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.