మైనర్ బాలికల నిర్భందం

హైదరాబాద్ నాచారం లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్తికేయ నగర్ లోని  శ్రీ సాయి నివాస్ అప్పార్ట్మెంట్ లో ఫ్లాట్ నెం 201, 202 లో మైనర్ బాలికలను నిర్భందించి పనిచేయించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ అచ్యుత్ రావు వారిని విడిపించే ప్రయత్నంలో ఆ ఇంటి యజమానులు పిల్లలను తీసుకెళ్లవద్దని ఆయనపైకి దాడికి దిగారు.

గత కొంతకాలంగా మాయమాటలతో తమ స్వగ్రామం నుండి తీసుకు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో ఆ బాలికలు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన రెవిన్యూ, పోలీసులు, బాల హక్కుల సంఘం సభ్యుల సహకారంతో బాలికలను వారి చెరనుండి విడిపించి పునరావాసానికి తరలించారు. పోలీసులు ఆ ఇంటి యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.