తెలుగు రాష్ట్రాల్లో మిర్చి మంట

Mirchi Farmers Protest in Telugu States over Price in Market Yards

Mirchi Farmers Protest in Telugu States over Price in Market Yards

రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి మంట కొనసాగుతోంది. మిర్చి దిగుబడి ఎక్కువగా రావడంతో మార్కెట్ యార్డులకు తీసుకురావడంతో మార్కెట్లన్నీ మిర్చి బస్తాలతో నిండిపోయింది. పంట ఎక్కువగా రావడంతో ధర తగ్గి రైతులు లబోదిబమంటున్నారు. ప్రభుత్వం కాపాడాలని కోరుతూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీలేక చివరికి కొన్ని మార్కెట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడ్తున్నారు రైతులు.

తెలంగాణాలోని వరంగల్ జిల్లా యనమాముల మిర్చి మార్కెట్ యార్డు దగ్గర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం ఉన్న ధర ఈరోజులేదని, సగానికి సగం ధర పడిపోయిందని చెబుతున్నారు రైతులు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు దగ్గర మిర్చిరైతులు రాస్తారోకో నిర్వహించారు. క్వింటాల్ మిర్చికి 10 వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గుంటూరు- పర్చూరు మధ్యలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ జాం ఎక్కువకావడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు.

మొత్తానికి మిర్చి మంట తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతుండడంతో ఆందోళనలో ఉన్నారు రైతులు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.