“మెగా ప్రిన్స్” ట్యాగ్‌ అవసరమా అంటున్న’మిస్టర్’ వరుణ్‌తేజ్

Mister Varuntej denies calling him with Mega Prince Tag

Mister Varuntej denies calling him with Mega Prince Tag

మెగా ఫ్యామిలీ నుండి లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌తేజ్ చేసిన మూడు సినిమాల్లో అన్నీ ఢిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలే. ఇప్పుడు లేటెస్ట్‌గా వరుణ్‌తేజ్ హీరోగా లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంతో తెరకెక్కి ఈనెల 14న విడుదలకు రెడీగా ఉన్న లవ్ ఎంటర్‌టైనర్ మిస్టర్. వరుణ్ ఇప్పటివరకు చేసిన ముకుంద, కంచె, లోఫర్‌ సినిమాలకు భిన్నంగా ఉండే కథను ఎంచుకొని తనలోని నటుడికి పరీక్ష పెట్టాడట. లక్ష్మీ నరసింహ ప్రాడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన మిస్టర్ సినిమా గురించి వరుణ్‌తేజ్ ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే…

“మిస్టర్‌ అందరికీ కొద్దిగా ప్రేమను పంచుతుంటాడు. లవ్‌ ఫీలింగ్‌, వెరీ గివింగ్‌ పర్సన్‌. ప్రేమ పంచడమే కాదు, ఎవరికైనా సహాయం కావాలన్నా ముందుంటాడు. అలాంటి వాడికి సమస్యలు వస్తే, వాడి లవ్‌ను వెతుక్కొవడానికి ఏం చేశాడనేదే కథ. ఈ సినిమాలో మెయిన్‌ ట్రయాంగిల్‌ స్టోరీ అయినా నాతో పాటు హీరోయిన్స్‌ లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్‌ ఇద్దరికీ ఓ బ్యాక్‌స్టోరీ ఉంటుంది. అది కాకుండా ముగ్గురు మధ్య జరిగే కథ మెయిన్‌గా ఉంటుంది. మిస్టర్‌ సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుండి నాకు చాలా మెమొరబుల్‌ మూవీ. ఈ సినిమా కోసం ఎక్కువ ట్రావెల్‌ చేశాం. హైదరాబాద్‌కు దూరంగా ఉండే లోకేషన్స్‌, చిక్‌మంగళూర్‌, కేరళ, స్పెయిన్‌ ఇలా అన్నీ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. ఇటలీలో ఒక సాంగ్‌, స్విజ్జర్లాండ్‌లో ఓ సాంగ్‌ చేశాం. అందరూ ఓ ఫ్యామిలీలా కలిసి ‘మిస్టర్‌’ సినిమాకు పనిచేశాం. అలా అన్నీ సినిమాలకు కుదరదు.”

“ఇంతకు ముందు నేను చేసిన మూడు చిత్రాల్లో నా క్యారెక్టర్‌ ఇన్‌టెన్స్‌గా ఉంటే, ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ లైవ్‌లీగా ఉండాలి, సెటిల్డ్‌గా కాకుండా, మూమెంట్‌తో క్యారెక్టర్‌ ఉండేలా శ్రీనువైట్లగారు కేర్‌ తీసుకున్నారు. దానిపై ఆయన వర్క్‌ చేసి నేను ఎక్కడైనా డ్రాప్‌ అవుతున్నట్లు అనిపించినా ఆయన చెప్పేవారు. డైలాగ్‌ డెలివరీ విషయానికి వచ్చేసరికి శ్రీనుగారికి ఒక టైమింగ్‌ ఉంటుంది. ఆ డైలాగ్స్‌ చెప్పేటప్పుడు నాకు కొత్తగా అనిపించాయి.

” ప్రతి ఒక్కరి జర్నీలో సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ కామన్‌గా ఉంటాయి. రీసెంట్‌గా మంచి విజయం లేనంత మాత్రాన ఆయన చేయలేరని కాదు. అందుకే శ్రీను వైట్లగారు దాన్ని కూడా ప్రూవ్‌ చేసుకోవాలని, యంగ్‌ హీరో హీరోయిన్స్‌తో ఓ మంచి ఫ్రెష్‌ లవ్‌స్టోరీ చేయాలని అనుకున్నారు. అంత పెద్ద డైరెక్టర్‌ మూలాల్లోకి తిరిగి రావాలనుకుని ‘మిస్టర్‌’ సినిమా చేశారు. శ్రీనువైట్లగారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ శ్రీనువైట్లగారు బాగా కష్టపడుతుండటం కళ్ళారా చూశాను. నేనెప్పుడైనా బద్ధకించినా ఆయన్ను చూస్తే ఇన్‌స్పైరింగ్‌గా ఉండేది. ఈ సినిమా షూటింగ్‌లో నేను గాయపడ్డ సందర్భంలో, నేను కొత్త దర్శకుల కథలను కూడా విన్నాను. ప్రస్తుతం శేఖర్‌ కమ్ములగారి ‘ఫిదా’ తర్వాత వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాను.”

నాన్నగారు ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూర్చొని గంట గంటన్నర మాట్లాడుతుంటాను. నాన్నగారికి నాపై నమ్మకం ఉంది. నా విషయంలో నాన్నగారు హ్యాపీగా ఉన్నారు. కథ ఎంపికలో నాన్న ఎప్పుడూ జోక్యం చేసుకోరు. అంతేగాక నీ జర్నీ నువ్వే చేయాలని అంటారు. అంతేగాక మా ఫ్యామిలీలో పెదనాన్న, కళ్యాణ్ బాబాయ్, చరణ్ అన్న, బన్నీ , తేజు ఇలా అందరితో అన్ని విషయాలు డిస్కస్ చేస్తుంటాను. మేము వీకెండ్స్‌లో కలుసుకున్నప్పుడు సినిమాల గురించి 20శాతం వేరే ఇతకర విషయాల గురించి 80శాతం మాట్లాడుతుంటాము. పేర్లకు ముందు ట్యాగ్లు తగిలించడం అనేది నాకెందుకో ఇష్టం ఉండదు. అందులోనూ నాకు మెగా ప్రిన్స్ అని ట్యాగ్ ఉంచడం వల్ల ఒక్కొక్కసారి ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేగాక బాలీవుడ్‌లో అంతపెద్ద సూపర్‌స్టార్లు ఎవరూ వాళ్ళ పేర్లకు ముందు ట్యాగ్లు పెట్టుకోరు.

శేఖర్‌ కమ్ములగారి దర్శకత్వంలో ‘ఫిదా’ మూవీ చేస్తున్నాను. 25 రోజుల చిత్రీకరణ చేయాల్సి ఉంది. సినిమా ఇప్పటికే 75 శాతం పూర్తయ్యింది. మంచి రిలీజ్‌ డేట్‌ అనుకుని రిలీజ్‌ చేస్తాం. క్లాసీ లవ్‌స్టోరీగా ‘ఫిదా’ తెరకెక్కుతోంది. క్రిష్‌తో రాయబారి చేయాల్సింది కానీ కొన్ని కారణాలతో కుదరలేదు. నేను, క్రిష్‌తో మాట్లాడుతూనే ఉన్నాం. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా రిలీజ్‌ తర్వాత క్రిష్‌తో మాట్నులాడినప్పుడు తను ఇప్పుడు బాలీవుడ్‌ మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు. నాకు కూడా రెండు, మూడు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఈ మధ్యలో ఇతర సినిమాలు చేసి రాబోయే రోజుల్లో రాయబారి తప్పకుండా చేస్తాం.” అంటూ తన మనసులోని మాటలను చెప్పుకొచ్చాడు వరుణ్‌తేజ్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.