రికార్డు క్రియేట్ చేసిన ‘మిస్టర్’

Mister Trailer video crossed 1 million views just in 21 hours

Mister Trailer video crossed 1 million views just in 21 hours

అందమైన ప్రేమ కథను… శ్రీనువైట్ల తనదైన స్టైల్లో కమర్షియాలిటీని ఎక్కడా మిస్ కాకుండా గ్రాండియర్ గా తెరకెక్కించిన సినిమా మిస్టర్. వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 21 గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం.

మిస్టర్ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో… ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మంచి ఎమోష‌న్స్‌కి, హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువ‌ల్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌ ఇది. స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశారు. అలాగే ఇండియాలోని చిక్ మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్‌ ఆరు పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి.

ఈనెల 29న ఆడియోను రిలీజ్ చేసి… ఏప్రిల్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బాప‌టేల్, ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి గోపీ మోహ‌న్‌ కథ అందించగా,శ్రీధ‌ర్ సీపాన‌ మాట‌లు అందించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.