కరుణించిన బాలయ్య

MLA Balakrishna visits his Constituency Hindupur after 8 months

సినిమా హీరోగా వంద సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఎప్పటినుండో రాజకీయాల్లో తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బాలయ్య 2014కు ముందు మరింత క్రియాశీలకంగా మారారు. అందులోభాగంగా రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ తరుపున హిందూపురం నుండి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు. అయితే ఏకకాలంలో అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైన పనే.
MLA Balakrishna visits his Constituency Hindupur after 8 months

ఇప్పటికి మూడేళ్ళు అవుతున్నా హిందూపురం ప్రజలకు తమ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారనే ఆశ ఇంకా తీరట్లేదు. అందుకే ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతిష్ట దిగజారేలా ఆయన సొంత నియోజకవర్గంలో ఘటన జరిగింది. తాగునీటి సమస్యతో సతమతమవుతున్న హిందూపురం ప్రజలు బాలయ్యకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అంతేగాక నియోజకవర్గ ప్రజలకు బాలయ్య అందుబాటులో లేకపోతుండటంతో.. ఆయనపై గతంలో ప్రతిపక్ష నేతలు మిస్సింగ్ కేసు నమోదు చేసారు.

See Also: శిరీష కేసులో మా కొడుకును ఇరికించారు

గత 8 నెలలుగా బాలయ్య హిందూపురం వైపు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బావమరిది ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో బిందెడు నీటిని 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడడం దురదృష్టకరమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతులపై బాలక్రిష్ణ పేరు రాసి ఆగ్రహాన్ని తెలిపారు. వామ పక్షాలు నిర్వహించి ఈ ర్యాలీకి మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది.తాను అన్ని పనులకు పక్కన పెట్టి తాగునీటి కోసమే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోయారు. వేసవి కావడంతో తమ నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయని అన్నారు. బాలయ్య పేరు రాసిన దున్నపోతులను కూడా ర్యాలీలోకి తీసుకుని వచ్చారు. ఇదంతా నెల క్రిందటి మాట.

See Also: ఇప్పటికైనా కళ్ళుతెరుద్దామా???

సినిమా షూటింగులు పూర్తిచేసుకున్న బాలయ్యకు ఏమనిపించిందో ఏమోకానీ ఒక్కసారి నియోజకవర్గాన్ని చూడాలనిపించి నిన్న నియోజకవర్గంలో పర్యటించి హల్‌చల్ చేశారు. సుమారు ఎనిమిది నెలల తర్వాత నియోజకవర్గానికి రావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. తానెక్కడున్నా హిందూపురం బాగోగుల కోసమే ఆలోచిస్తూ ఉంటానన్న బాలయ్య  ప్రజల దాహార్తిని తీర్చేందుకు త్వరలోనే హంద్రీనీవా నీటిని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. సినిమా షూటింగ్‌ల వల్ల నియోజకవర్గానికి కొన్ని రోజులు దూరంగా ఉన్నానని త్వరలోనే హిందూపురంలో 23 కోట్ల రూపాయలతో మార్కెట్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తానని చెప్పి బాలయ్య నియోజకవర్గంలో చేసిన పర్యటన టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

See Also: ఒక్క అంగుళం భూమి కూడా పోనివ్వం

Have something to add? Share it in the comments

Your email address will not be published.