ఇదేం దిక్కుమాలిన పాలసీ

MLA Roja Sensational comments on Bar policy taken by AP Cabinet

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మందలించడం వల్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, అందుకే భూ కబ్జాలకు వ్యతిరేకంగా విశాఖపట్టణంలో చేసిన పార్టీ కార్యక్రమానికి సైతం డుమ్మా కొట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజాపై గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అంతేగాక త్వరలోనే రోజా వైసీపీని వీడనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

MLA Roja Sensational comments on Bar policy taken by AP Cabinet

అయితే ఈ ప్రచారాలన్నింటినీ పటాపంచలు చేసేలా ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి తనదైన స్టైల్లో చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడింది. కులం కోసం నన్ను ఓడించిన చంద్రబాబు ఎక్కడ… పార్టీలోకి రాగానే నన్ను ఎమ్మెల్యేను చేసిన జగన్‌ ఎక్కడ అంటూ చంద్రబాబుపై విరుచుకపడ్డారు.  అంతేగాక తలతోకలేని జనసేన పార్టీలోకి వెళ్ళను అని ప్రాణం ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటానని జగన్‌కు రుణపడి ఉంటానని శపథం చేశారు రోజా.

అంతేగాక మహిళల భద్రత విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకి పారేశారు రోజా. ఆమె మాటల్లోనే.. ” మహిళా భద్రతకే ప్రాధాన్యం, మహిళా సాధికారతే మా మ్యానిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు పెట్టి, మహిళా దినోత్సవాల రోజు, మహిళా పార్లమెంటేరియన్ లో సుధీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చే ఈ అధికార పార్టీ ముఖ్యమంత్రి గాని, ఆయన పార్టీలోని సభ్యులు గానీ ఈ రోజు మహిళా భద్రకోసం గానీ, మహిళా సాధికారత గురించి ఏమైనా చేశారా అంటే శూన్యం. ఈ రోజు వాళ్ల ధన దాహానికి మద్యం విధానాల వల్ల ఈ రోజు ఆడవాళ్ల జీవితాలు బలిఅవుతున్నా, రోజు రోజుకీ విద్యార్ధులపై వేధింపులు పెరుగుతున్నాఎక్కడైనా వాటిని నివారించే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏమీ కూడా కనిపించడం లేదు.”

See Also: ఒక్క అంగుళం భూమి కూడా పోనివ్వం

“ఈ రోజు రాష్ట్రంలోని మహిళా ఎంఎల్ఏకే రక్షణ లేనప్పుడు ఒక సాధారణ మహిళకి వీళ్లు ఏ విధంగా రక్షణ కల్పిస్తారో అర్ధం కావట్లేదు. ఎలక్షన్‌కు ముందు మహిళలకు ఏ కష్టమొచ్చినా, వేధిస్తే ఫోన్ చేసిన 5 నిమిషాలకే వచ్చి తాట తీస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ రోజైనా ఆ పని చేసిందా అని చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాను. ఇంకా సిగ్గు లేకుండా కోడలు మగపిల్లాడు కంటే అత్త వద్దంటుదా అని ఆడదాని పుట్టుకనే ఈ రోజు మీరు అవమానించే పరిస్థితికి వచ్చారంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ఏపీలో ఉన్న మహిళలంతా సిగ్గుపడుతున్నారు.”

AP Bar Policy GO Page1

AP Bar Policy GO Page2

 

“ఈ రోజు నారా వారి నరకాసురపాలనలో మహిళలకు రక్షణ ఎక్కడా లేకుండా పోయింది. ముఖ్యంగా ఎన్నికల్లో ఏం చేప్పారు 2 రూపాయలకే 20 లీటర్ల మంచి నీటి పథకం ద్వారా అందిస్తామని చెప్పారు. ఈ రోజు తాగే నీళ్లు ఇచ్చే చిత్త శుద్ది గాని, దాని గురించి మీటింగులు పెట్టి దానిమీద డెసిసెన్స్ తీసుకోవడానికి సమయం కూడా లేదు. కానీ ఇంటింటికి మద్యాన్ని అమ్మించేదానికి మీరు ఏం చేయబోతున్నారో అన్నింటికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న మీరు ఇచ్చిన జీవో చూస్తుంటే మీరు ఎంత దిగజారిపోయారో ఈ జీవో వల్ల స్పష్టంగా అర్ధమవుతుంది. ముందు ప్రతి సంవత్సరం కూడా బార్ల లైసెన్సులు రెన్యూవల్ చేసేవాళ్లు. అలాగే 50 వేల మంది జనాభా ఉంటే ఒక బారు ఉండేది.”

“ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బార్ పాలసీ ఫర్ ది పీరియడ్ 2017 నుండి 2022 అంటే లైసెస్సులు 5 సంవత్సరాలకు. దీని బట్టి అర్ధమవుతుంది. మందు బాటిల్ సాక్షిగా, మందు బాటిల్ మీద ప్రమాణం చేసి భవిష్యత్తులోకి నేను అధికారంలోకి రాలేను, మా పార్టీ అధికారంలోకి రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని స్పష్టంగా అర్ధమవుతుంది. ఎందుకంటే ఈ రోజు సక్రమంగా ఎన్నికలు జరిగితే 2019లో జరగాలి. మధ్యంతర ఎన్నికలు వస్తే ఎప్పుడైనా రావచ్చు. అలాంటి మీకు ఏ అర్హతతో 5 సంవత్సరాలు లైసెన్సు ఇవ్వడానికి పూనుకున్నారనేది అగుతున్నాం.”

See Also: ఇప్పటికైనా కళ్ళుతెరుద్దామా???

“ఎందుకంటే మద్యనిషేదం అన్నది మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు తీసుకుస్తే దానికి తూట్లు పొడుస్తూ ఏ విధంగా మీరు తాగండి, తాగించండి, చచ్చేంతవరకు తాగండి అన్న విధానంగా ఈ రోజు రాష్ట్రాన్ని మద్యాంద్రప్రదేశ్ గా, బారాంధ్రప్రదేశ్ గా మార్చాలనే ప్రయత్నం మాకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు అనేకన్నా సారా చంద్రబార్‌నాయుడు అని పెట్టుకుంటే మీకు సరిపడుతుందని మేం అందరం అనుకుంటున్నాం. మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా మంచినీటికి సంబందించి 2022, 2029, 2050 టార్ గెట్లు లేవు. 2019 టార్గెట్లు అసలే లేవు. కాని మద్యానికి మాత్రం 5 సంవత్సరాల పాటు టార్గెట్లు పెట్టుకుంటూపోతే 30 వేల మందికి ఒక బారు అంటూ కొత్తగా 85 బార్లకి మీరు లైసెన్సులు ఇచ్చారంటే ఏమనుకోవాలి.”

“అంటే మద్యం లైసెన్సులు తీసుకున్న వ్యాపారస్తుల వద్ద ఎన్ని వందల కోట్లు వసూలు చేసారనేది అర్ధమవుతుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు వాటి ఎంత? లోకేష్ వాటా ఎంత? ఎక్సైజ్ శాఖ మంత్రి వాటా ఎంత? అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 30 వేల మందికి ఒక అంబులెన్స్, ఒక ఆసుపత్రి, ఒక మంచి నీటి పథకం ఈ మూడేళ్ల కాలంలో ఎక్కడైనా మీరు పెట్టారా? కానీ బార్లు మాత్రం 30 వేలు మంది ఉంటే ఒక బారు ఉండాలన్నట్టు జీవో విడుదల చేశారంటే మీకన్నా సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని ప్రశ్నిస్తున్నాను.”

“మనసున్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రైతేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అది రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగంలోనే అది సాధ్యపడింది. కాని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికే తప్పా వారికి ఎటువంటి సంతోషాన్ని, సుఖాన్ని అందించిన దాఖలాలు ఎక్కడా లేవు. రాజశేఖర్ రెడ్డి ఒక సంతకం చేశారంటే అది ఆ రోజు, ఆ క్షణం నుండే అమలులోకి వస్తుంది. కాని చంద్రబాబు నాయుడు రెండవ సంతకమని చెప్పి బెల్టు షాపులన్నీ కూడా నిర్మూలిస్తాను, దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తాను, కొత్త బార్లకు గానీ, కొత్త మద్యం ఫ్యాక్టరీలకు గానీ లైసెన్సులు ఇవ్వననీ అని చెప్పిన పెద్దమనిషి, ఈ రోజు వాళ్ల పచ్చ తమ్ముళ్లు ఈ బెల్టు షాపులు నడిపిస్తుంటే వాటని నియంత్రించకుండా, వాళ్లను కాపాడుతూ మీరు ఇంకా అమ్ముకోండి, ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేయండి. కొత్త బార్ల పరిస్థితి కూడా ఈ రోజు లైసెన్సులు ఇచ్చారంటే ఇతని ప్రజల మీద ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధం చేసుకోవాలి.”

See Also: కరుణించిన బాలయ్య

“చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో మరో అత్యంత దుర్మార్గమైన నిర్ణయం ఈ జీవో. మొత్తం తాగుబోతులంతా క్యాబినేట్లో కూర్చోని తీసుకున్న బార్ల పాలసీ అని దీంట్లో అర్ధమవుతుంది. ఈ జీవో వల్ల వీళ్లు ఎన్ని వందల కోట్ల ముడుపులు తీసుకుంటారు. దాని కోసం ఎంత దిగజారిపోయి వాళ్లకు అర్హత లేకపోయినా కూడా 5 ఏళ్లకు ఇచ్చారు అనేది చిన్నపిల్లాడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితికి వచ్చింది.” అని ఘాటుగా విమర్శించారు ఫైర్‌బ్రాండ్ రోజా.

Have something to add? Share it in the comments

Your email address will not be published.