రగులుతున్న ‘మోడీ రాజకీయం’

Modi Politics The verbal war between TDP and YSRCP leaders doubled as political senario changed

Modi Politics The verbal war between TDP and YSRCP leaders doubled as political senario changed

ప్రధాని నరేంద్ర మోడీతో జగన్మోహన్‌రెడ్డి భేటీ తర్వాత తెలుగు తమ్ముళ్ళలో కలవరపాటు మరీ ఎక్కువైంది. తమకొక్కరికే దోస్త్ అనుకుంటున్న సమయంలో మధ్యలో తమ నాయకుడు అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో రాజకీయ శత్రువుని పిలిపించుకొని మాట్లాడినప్పటినుండి పసుపు రక్తం మరిగిపోతోంది. అంతేగాక మోడీతో జగన్ భేటీ అయ్యారని మాటి మాటికి గుర్తుకొచ్చి ముద్ద మింగుడుపడట్లేదు టిడిపి నాయకులకు. అందుకే అమెరికా పర్యటన ముగించుకొని నేరుగా ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు సైతం తనతోపాటు ఉన్న అందరినీ పంపించేసి ఒక్కరే ఆరు గంటలపాటు అజ్ఞాతంలోకి వెళ్ళి జరిపిన రహస్య మంతనాలు సైతం ఢిల్లీలో ఏదో సీీరియస్‌గా జరుగుతోందనే సందేహాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

దీంతో ఒకరి తర్వాత ఒకరు తెలుగుదేశం మంత్రులు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై మండిపడుతున్నారు. లేటెస్ట్‌గా మంత్రి సోమిరెడ్డి జగన్‌పై ధ్వజమెత్తారు. మిర్చి రైతు సమస్యలపై ఇక్కడ హడావిడి చేసి , రాష్ట్రపతి, ప్రధాని వద్దకు వెళ్లి ఏ సమస్యల సమస్యలు చర్చించారో ప్రజలకు  జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక మతతత్వ పార్టీ అంటూ ఎన్నికల సమయం లో విమర్శించిన జగన్ ఎప్పడు ఎందుకు మోడీకి మద్దతు ఇస్తున్నాడో తెలియాలని విమర్శించారు.

జగన్‌ తన వ్యక్తిగత సమస్యల పై మోడీ ని కలిసారా లేక రాష్ట్ర సమస్యల కోసం కలిశారా? ఏ సమస్యలపై పోరాటం చేయాలో కూడా జగన్‌కు తెలియటం లేదని దుయ్యబట్టిన సోమిరెడ్డి ఇప్పటి వరకు జగన్ కనీసం 30 రోజులు సొంత రాష్టంలో నిద్ర చేశాడా? అని ప్రశ్నించారు. అందుకే జగన్‌ను తాము ఇప్పటికీ ప్రవాసాంద్రుడిగానే చూస్తున్నామని తెలిపారు. అసలు రైతు సమస్యలపై ఏం అవగాహన ఉందని జగన్ మాట్లాడుతున్నాడన్న సోమిరెడ్డి మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అదుకుంటుందని, మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలూ లేవని స్పష్టంచేశారు.

దేశంలో ఎక్కడ ఏ 1 ముద్దాయి గా ఉన్న పార్టీ నాయకుడి లేరని, కేవలం జగన్‌కు మాత్రమే  ఆ గౌరవం దక్కిందని అన్నారు. అంతేగాక మోడీ అవినీతి పరుల పాలిట చెండ శాసనుడని, అవినీతి పరులను మోడీ మిత్రపక్షంగా చేసుకుంటాడని అనుకోవట్లేదని స్పష్టంచేశారు సోమిరెడ్డి.

మరోవైపు వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన చంద్రబాబు ఢిల్లీలో 6గంటలు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక వైఎస్‌ జగన్‌ మగాడిలా మీడియా సమక్షంలో  ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారని తెలిపారు రోజా. అంతేగాక ఆ 6 గంటల్లో  చంద్రబాబు అమిత్‌ షా కాళ్లు పట్టుకోవడానికా లేక హోంమంత్రి కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. స్నానం చేయకుండా 24 గంటలపాటు రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నానని చంద్రబాబు అన్న మాటలకు జనం నవ్వుకుంటున్నారని బాబు ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదని విమర్శించారు.

మొత్తానికి ప్రధాని నరేంద్రమోడీ వేసిన పాచికలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ హీటెక్కాయి. రాబోయే రోజుల్లో కేంద్రానికి ఎవరు దగ్గరౌతారో, ఎవరు దూరమౌతారోనన్న ఆతృత జనాల్లో మరీ ఎక్కువౌతోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.