కె.సి.ఆర్ పై సినిమా

(పాత చిత్రం)

  • కె.టి.ఆర్, కవితల స్ర్కీన్ ప్లే

హైదరాబాద్: టాలీవుడ్ లో సంచలనం సృష్టించి చిన్న బడ్జెట్ సినిమాలలో తలమానికంగా నిలిచి నేడు తెలుగు సినిమాకు జాతీయ అవార్డును అందించిన సినిమా “పెళ్లిచూపులు”. ఈ సినిమా నిర్మాత రాజ్ కందుకూరి కె.సి.ఆర్ పై సినిమా నిర్మాణానికి సిద్దమయ్యారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి, 2018 లో రిలీజ్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. థర్మపథ బేనర్ పై నిర్మించే ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టవలసి ఉంది. మధుర శ్రీధర్ దరకత్వం తో పాటు, కథ, స్ర్కీన్ ప్లే అందిస్తున్నాడు. తారాగణం, సాంకేతిక సిబ్బంది ఎంపికతో పాటు, మిగిలిన పనులపై శ్రీధర్ బిజీబిజీ గా ఉన్నారు.

కె.సి.ఆర్ పై నిర్మించే ఈ చిత్రం ఆయన నాయకత్వ పటిమకు, తెలంగాణ ఉద్యమ ప్రస్థాన నేపథ్యం, పరిపాలనా దక్షత, మొదలైన అంశాల చుట్టూ కథనం రుపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత,దర్శకులు, కె.టి.ఆర్, కవితలను కలిసి వారి ఆమోదం పొందారు.

ఈ సినిమా కథ, కథనాలను కె.టి.ఆర్, కవితలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఐతే ఈ చిత్ర నిర్మాత, దర్శకులు ఇంకా కె.సి.ఆర్ ను కలవాల్సి ఉంది. తండ్రిపై వచ్చే ఈ సినిమా రూపకల్పనలో, వీరిది ప్రధాన భూమిక కానుందనే వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా, కె.సి.ఆర్ పై సినిమా తీస్తానని గతంలో ప్రకటించాడు.

ఏది ఏమైనా! మంచి బేనర్ పై వస్తున్న ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు, విదేశాలలో ఉన్న తెలుగువారు, కే.సి.ఆర్ అభిమానులు, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

-మారుతి

Have something to add? Share it in the comments

Your email address will not be published.