సినిమా టికెట్ సరే మరి పాప్‌కార్న్ సంగతేంటి??

Ticket prices increase becomes more burden to Cinema Lovers

ఖాళీ సమయంలో హాయిగా ఎంజాయ్ చేయాలని ఫ్యామిలీతోనో లేక ఫ్రెండ్స్‌తోనో సినిమా చూసే అలవాటు మీకుందా?? రిలీజ్ అయిన ప్రతీ సినిమాని వదలకుండా చూస్తారా?? ఫ్రెండ్స్‌కి పార్టీలంటే కేరాఫ్ అడ్రస్ మల్టీప్లెక్స్‌లేనా?? అయితే ఇక ఇప్పటినుండి సినిమాకి వెళ్ళాలని ఆలోచన వచ్చిన ప్రతిసారీ మీ పర్సును ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మరీ వెళ్ళాల్సిందే… ఎందుకంటే ఇప్పటికే అడ్డగోలుగా ఉన్న సినిమా రేట్లు మరింత పెరగనుండడమే కారణం.

Ticket prices increase becomes more burden to Cinema Lovers

ఎంజాయ్‌మెంట్ కోసం సినిమా థియేటర్లనే నమ్ముకొనే జీవులకు ప్రభుత్వ నిర్ణయం భారంగా తయారుకానుంది. గ్రేటర్ పరిధిలో సింగల్ థియేటర్ పద్ధతినుండి మల్టీప్లెక్స్ సంస్కృతి వచ్చేయడంతో ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్‌లే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఇసిఐఎల్, మల్కాజ్‌గిరి, కొంపల్లి ఇలా సిటీ నలుమూలలా మల్టీప్లెక్స్‌లే ఉండడంతో సినిమాకి వెళ్ళాలనుకొనే ప్రతీ ఒక్కరికీ ఆప్షన్లుగా మారాయి.

See Also: కమిట్మెంట్‌కి మెచ్చుకోవాలా లేక…???

అయితే గత కొన్ని రోజులుగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని గ్రేటర్‌ పరిధిలోని చిన్న థియేటర్‌‌నుండి మల్టీప్లెక్స్‌‌ల వరకు అన్ని సినిమా థియేటర్ల టిక్కెట్ల ధరలు పెరుగుతున్నాయి. దీనికోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్‌ యాజమాన్యాలకు అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో సినిమా మరింత భారంగా మారింది.

సిటీల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన కల్చర్‌తో హాలిడేస్‌లోనే సినిమాలనుకొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి మూడ్ వచ్చినప్పుడు సినిమా అనుకొనే రేంజ్‌కి చేరిపోయాం. అంతేగాక సినిమాకోసమని ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళకంటే షాపింగ్‌కోసమని వెళ్ళి అక్కడే బయట రెస్టారెంట్లో తిని సినిమాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఒక్కసారి నలుగురు కలిసి సినిమాకోసమని బయటికి వెళ్తే కనీసంలో కనీసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఈ ఖర్చు సినిమా టికెట్ ధర పెరుగుతుండడంతో మరింత భారంకానుంది.

Ticket prices increase becomes more burden to Cinema Lovers1

ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 250 స్క్రీన్లలో ప్రతీరోజు సినిమాలు వేస్తున్నారు. దీనికి సాధారణ ఏసీ థియేటర్లో బాల్కనీకి ఉన్న టికెట్‌ను 120 రూపాయల వరకు పెంచుకొనే అవకాశం కల్పిస్తున్నారు. అంతేగాక లోయర్ క్లాస్ ధర ఒకప్పుడు 5 రూపాయలు ఉండేది… దాన్ని ఈ మధ్య 20 రూపాయలకు తీసుకొచ్చారు. ఇప్పుడు దాని ధరను కూడా 40 వరకు పెంచుకొనే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కూలీనాలీ చేసుకొని అభిమాన హీరో సినిమాకి వెళ్ళే బడుగుజీవిపై భారం ఎక్కువగా పడుతోంది.

మరోవైపు ఈమధ్య పెరిగిన మల్టీప్లెక్స్‌లలో ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలను మరో 50 రూపాయలు పెంచుకొనే అవకాశం కల్పించారు. ప్రస్తుతం 125 రూపాయల నుండి 175 రూపాయల వరకు ఉన్న టికెట్‌కు 50 రూపాయలు పెరగనున్నాయి. వీటికితోడు బిగ్‌ స్క్రీన్‌ల టికెట్లను సైతం 250 రూపాయల నుండి 300 రూపాయలకు పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో సినిమా సగటు ప్రేక్షకుడికి మరింత భారంకానుంది.

See Also: సవాళ్ళు- ప్రతి సవాళ్ళతో హీటెక్కుతున్న నంద్యాల

అయితే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే టికెట్ల ధరలకంటే అక్కడ అమ్మే స్నాక్స్ ధరలతో జేబుకి చిల్లుపడుతోంది. బయట మార్కెట్‌లో 20 రూపాయలకు దొరికే పాప్‌కార్న్‌ మల్టీప్లెక్స్‌ల్లో 150 రూపాయలకు తక్కువ ఉండదు. అంతేగాక బయట 40 నుండి 60 రూపాయలకు దొరికే 900 ఎంఎల్ కూల్‌డ్రింక్ అక్కడ 175 రూపాయలకు తక్కువ అమ్మరు. ఇలాంటి వాటి వల్ల సినిమా థియేటర్లు అంటేనే జనాలు భయపడే పరిస్థితికి చేరుకున్నారు. ఇప్పటికైనా సినిమా టికెట్ల ధరలు పెంచుతున్న ప్రభుత్వం మరో అంశంపై దృష్టిపెట్టాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

See Also: కొత్తగా వస్తున్న దండుపాళ్యం 2

పెరిగిన ధరల ప్రకారం టికెట్ల ధరలు ఇలా ఉంటాయి

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఏసీ థియేటర్లలో: బాల్కనీ – 120/-, లోయర్‌ క్లాస్‌ – 40/-

గ్రేటర్‌లోని నాన్‌ ఏసీ థియేటర్లలో: బాల్కనీ – 60/-, లోయర్‌ క్లాస్ –  20/-

మున్సిపాలిటీల పరిథిలోని ఏసీ థియేటర్లలో: బాల్కనీ – 80/-, లోయర్‌ క్లాస్- 30/-

మున్సిపాలిటీల్లోని నాన్‌ ఏసీ థియేటర్లలో: బాల్కనీ – 60/-, లోయర్‌ క్లాస్– 20/-

నగర పంచాయితీ, గ్రామపంచాయితీ పరిథిలోని ఏసీ థియేటర్లలో:  బాల్కనీ – 70/-, లోయర్‌ క్లాస్ – 20/-

Have something to add? Share it in the comments

Your email address will not be published.