‘రామన్న’ తెలంగాణాలో అందరికీ అన్న : ఎంపీ కవిత

MP Kavitha Sesational comments on KTR in Armoor Janahitha Janasabha

MP Kavitha Sesational comments on KTR in Armoor Janahitha Janasabha

జనహిత జనసభ వేదికగా వేలాదిమంది ప్రజలసాక్షిగా తెలంగాణా ఆడబిడ్డ ముఖ్యమంత్రి కెసిఆర్ గారాలపట్టి నిజామాబాద్ ఎంపీ కవిత దుమ్మురేపేలా ప్రసంగం చేసారు. మొదటిసారిగా అన్నాచెల్లెళ్ళు ఇద్దరు కెటిఆర్ కవిత ఒకే వేదికపై ప్రసంగించడంతో ఆర్మూర్‌ జనసభలో గులాబీ జెండా రెపరెపలాడింది.

తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకి, ఇక్కడి సంస్కృతిలోనే అన్నా, చెల్లెళ్లకు బంధం చాలా గొప్పగా ఉంటుంది. అన్నా అంటే అమ్మ పదంలోనుంచి మొదటి అక్షరం. నాన్న పదంలోనుంచి రెండో అక్షరం, ఈ రెండు కలిపితేనే అన్న అవుతాడు. అమ్మ యొక్క ఆత్మీయత, నాన్న యొక్క బాధ్యత. ప్రపంచంలో ఎక్కడన్నా ఆడపిల్లలు నాకు ఎట్టాంటి తోబుట్టువు ఉంటే బాగుంటదని కోరుకుంటారో అలాంటి అన్న నాకు ఉన్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చాలా గర్వపడుతున్నాను. ఈ అన్న నా ఒక్కదానికే అన్న కాదు, మొత్తం తెలంగాణాలో ఉన్న ఆడబిడ్డలందరికి, అన్నాతమ్ముళ్లందరికి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికోసం కూడా పనిచేయడానికి బరువు నెత్తినేసుకొని తిరుగుతున్నాడని మంత్రి కెటిఆర్‌ను ఉద్దేశించి అన్నారు కవిత.

MP Kavitha Sesational comments on KTR in Armoor Janahitha Janasabha

తెలంగాణా రాష్ట్రం ఏర్పడకముందు ఏర్పడ్డ మూడు రాష్ట్రాలకంటే ఇక్కడే రాజకీయ సుస్థిరత ఉందన్న కవిత తెలంగాణా రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారైందని గర్వంగా చెప్పుకొచ్చారు. తెలంగాణాలో కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇక్కడ ఉన్న పచ్చపార్టీ, కుట్రలు చేసే కాంగ్రెస్ పార్టీలను మట్టి కరిపించి తెలంగాణా ప్రజల పక్షాన నిలబడ్డ ఏకైక పార్టీగా టీఆర్ఎస్ ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పేద ప్రజల కోసం ఆలోచన చేస్తుందని, గతంలో ఎప్పుడైనా ఎవరైనా బీడీ కార్మికుల గురించి మాట్లాడారా? ఒంటరి మహిళ గురించి ఆలోచించారా? ఏరోజైనా 200 పింఛను వస్తే నెల తిరిగే సరికి ఏం తింటారని ఆలోచన చేశారా? అని ప్రతిపక్షపార్టీలను దుయ్యబట్టారు.

మొత్తానికి ఆర్మూరు జనహిత సభలో కెటిఆర్, కవితల ప్రసంగాలు ప్రజలను ఉత్తేజపరుస్తూనే వాళ్ళలోని భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.