శభాష్ కేసీఆర్ అంటున్న ముద్రగడ

Mudragada Padmanabham praises Telanagana CM KCR for passing reservation bills for minorities and Tribes
Mudragada Padmanabham praises Telanagana CM KCR for passing reservation bills for minorities and Tribes
తెలంగాణా ప్రభుత్వం తాజాగా తీసకున్న రిజర్వేషన్ల పెంపును బిజెపి విమర్శిస్తుంటే కెసిఆర్‌ను మెచ్చకుంటూ లేక రాశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ల విషయంలో ఎంతో ముందుండి ఉద్యమాన్ని నడిపించి హైలెట్ అయిన ముద్రగడ కెసిఆర్‌కు రాసిన లేఖ సోషల్‌మీడియాలో సంచలనమైంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఆయనను అభినందిస్తూనే.. పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఇచ్చిన సమయానికంటే ముందుగానే నేరవేర్చారని, రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలను లేకుండా చేయడమనేది చాలా గొప్ప విషయమని ముద్రగడ అభినందించారు.
Mudragada Pdmanabham letter to KCR
ఈమధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను తప్పు అని నిరూపించేలా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని ఎన్నికల మేనిఫెస్టోలు చిత్తుకాగితాలు కావని దేశంలో కేసీఆర్ మాత్రమే నిరూపించారని ప్రశంసించారు ముద్రగడ. అంతేగాక గిరిజనులు, ముస్లింలు, బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం చూస్తుంటే అణగారిన వార్గాల కోసం అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ ప్రయాణముందంటూ ముద్రగడ మెచ్చకున్నారు.
అదే సమయంలో కేసీఆర్‌ను మెచ్చకుంటూనే తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఘాటుగా విమర్శించారు ముద్రగడ. నాయకులను గౌరవించి ఓట్లు వేసిన ఓటర్లను గౌరవించాలి కానీ, తమ ముఖ్యమంత్రి చంద్రబాబులాగా ఇచ్చిన హామీలు అడిగితే లాఠీలతో కొట్టించడం, అక్రమ కేసులు పెట్టి బాధించే కార్యక్రమాలు చేయొద్దని సూచించారు. పదవులు, ఆస్తులు, జీవితాలు శాశ్వతం కాదని, పేరు మాత్రమే శాశ్వతమని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పూర్తిగా న్యాయం చేయండి అని, ఎన్నికలలో ఓటర్లను డబ్బుకి, మద్యానికి బానిసలను చేయకుండా ఖర్చులేని ఎన్నికలు చేసేందుకు ప్రయత్నించాలని ముద్రగడ సూచించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసి దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నారని, రూపాయి ఖర్చు లేకుండా కూడా ఎలక్షన్లు చేశారు అనే పేరు కూడా తెచ్చుకుని ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలవాలన్నారు. మీ పాలనకు నా అభినందనలు అని ముద్రగడ కేసీఆర్‌ను అభినందించారు ముద్రగడ పద్మనాభం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.