‘యోగి’తో మార్పు ఖాయం అంటున్న ములాయం చిన్న కోడలు

Mulayam Choti Bahu Aparna Yadav lauds Yogi Adityanath for bringing a positive and secular change in UP

Mulayam Choti Bahu Aparna Yadav lauds Yogi Adityanath for bringing a positive and secular change in UP

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలతో అటు రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆయనకు అభిమానులుగా మారుతున్నారు. సొంతపార్టీ కార్యకర్తలేకాకుండా ఏకంగా ములాయం కోటరీలో కూడా ఇప్పుడు ఆదిత్యనాథ్ జపం జరుగుతోంది. ఈమధ్యకాలంలో ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల త్వరలోనే ఉత్తర్‌ప్రదేశ్ రూపురేఖలు మారిపోవడంతోపాటు యూపీ పరిస్థితుల్లో ఖచ్చిలతంగా ఆయన మార్పులు తీసుకొస్తారని అంటున్నది ఎవరో బిజెపి నాయకుడు అనుకుంటే పొరపాటే. ఈ కామెంట్స్ చేసింది ఆదిత్యనాథ్ వైరివర్గంలోని ఓ కీలక సభ్యురాలు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు.

జంతు సంరక్షణకు సంబంధించి ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ చెబుతున్నారు. యోగిపై ప్రశంసల జల్లు కురిపించిన ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లో కబేళాలను మూసివేయించడం చాలా మంచి నిర్ణయం అయినప్పటికీ వాటిని జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న వారికి వేరే ఉపాధి కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇప్పటికైనా పార్టీ బాధ్యతలు తండ్రి ములాయంకి అప్పగిస్తేనే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్వుతుందని గుర్తుచేశారు. మా కుటుటంబంలో నేతాజీ ( ములాయంసింగ్ యాదవ్) నిర్ణయమే ఫైనల్ అని చెప్పిన అపర్ణ ఎన్నికల సమయంలో ఆయనపట్ల ఇతరులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని ఎప్పటికైనా మా కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు అపర్ణ తెలిపారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.