ఇళయరాజాకు కోపం వచ్చింది

Can’t use my songs without getting rights from me

Can’t use my songs without getting rights from me

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజాకు కోపం వచ్చింది. ఆయన స్వరపరచిన పాటలను తన అనుమతి లేకుండా పాడినందుకు గానగంధర్వుడు ఎస్ బి బాలసుబ్రమణ్యంకు లీగల్ నోటీసులు పంపారు. ఈ వార్త ప్రపంచంలోని సంగీత అభిమానులను కలవరపెడుతోంది. ఇటీవల విడుదలవుతున్న సినిమాలలో బాలు పాటలు పాడటానికి పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ, ఇతర దేశాల్లో సంగీత కచేరీలను నిర్వహిస్తున్నారు. ఇతర సంగీత దర్శకులు స్వరపరిచిన పాటలను బాలు వేదిక మీద పాడి అభిమానులను అలరిస్తుంటారు.

అయితే కొంత కాలంగా ఇళయరాజా తను స్వరపరచిన పాటల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ వేదికల మీద తన అనుమతి లేకుండా, తాను స్వరపరచిన పాటలు పాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకున్నారు. ఈ నేపధ్యంలో ఇతర దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తున్న ఎస్ బి బాలసుబ్రమణ్యంతో పాటు గాయని చిత్ర, ఎస్ పి కుమార్ చరణ్ లకు ఇళయరాజా లీగల్ నోటీసుల పంపించారు. తన అనుమతి లేకుండా తాను స్వరపరచిన పాటలను ఇక మీదట సంగీత కచేరీలలో ఆలపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.