సంగీత కోర్సుల్లో ప్రవేశాలకై తానా ఆహ్వానం

డల్లాస్టెక్సాస్: అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), శ్రీ పద్మావతి  మహిళా  విశ్వవిద్యాలయం అనుసంధానంతో చరిత్ర లోనే మొట్ట మొదటి సారిగా సంగీతం లో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు  ప్రారంభించిందని తానా అధ్యక్షులు డాక్టర్ జంపాల చౌదరి తెలిపారు. మన సంస్కృతీ  సంప్రదాయాలను పెంపొందించేందుకు  తానా  తీసుకున్న మరో మెట్టని ఆయన తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ అధికారులతో చర్చలు జరిపి ఈ కార్యక్రమం  రూపుదాల్చుకునేందుకు కృషి చేసిన తానా  పూర్వాధ్యక్షులు డాక్టర్  తోటకూర ప్రసాద్,  విశ్వవిద్యాలయ అధికారులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ  1983 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో  తానా సంగీత కోర్సులు  ప్రారంభించడం తానా చరిత్రలో ఒక మైలురాయన్నారు. ఈ  విశ్వవిద్యాలయం  రూపొందించిన  సంగీత పాఠ్య ప్రణాళికను ఉత్తర అమెరికా లోని  విద్యార్థులు  పాటిస్తే, అమెరికా లోనే  పరీక్షలు  వ్రాసి, అన్ని నాలుగు స్థాయిలు  పూర్తి చేసిన తరువాత యూనివర్సిటీ  డిప్లొమా  సర్టిఫికెట్స్  పొందవచ్చని ఆయన తెలిపారు. అమెరికా లో నివసిస్తున్న సంగీత ప్రియులు తమ ప్రతిభా పాఠవాలను పరీక్షించుకోవాలనే దీర్ఘకాలిక  కలను సాకారం చేసినందుకు పద్మావతి  మహిళా  విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. దుర్గా భవానీ, డీన్ ప్రొఫెసర్ డి. శారద, మరియు వారి సిబ్బంది సహకారానికి తోటకూర ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నారై విద్యార్థులకు సంగీతం నేర్చుకోవడానికి, సంగీతంలో  అడ్వాన్స్డ్  డిప్లొమా సర్టిఫికెట్  పొందడానికి  ఇదొక గొప్ప అవకాశమన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ సంగీత కోర్సుల్లో నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నారై స్టూడెంట్స్ భారతదేశం ప్రయాణం  చేయకుండానే  అమెరికా లోనే  పరీక్షలు రాసి,  డిప్లొమా సర్టిఫికెట్ పొందడానికి గొప్ప అవకాశముందన్నారు.  దీని వల్ల సమయంతోపాటు డబ్బు ఆదా అవుతుందని ఆమె తెలిపారు.

ఉత్తర అమెరికా లో నివసిస్తున్న ఆసక్తి గల విద్యార్థులెవరైనా మార్చి 20, 2017 లోగా ఈ  కోర్సుల్లో నమోదు కావచ్చు. డాక్టర్ ప్రసాద్ తోటకూర శ్రీమతి మీనాక్షి  అనిపిండి తెలిపారు.

డల్లాస్ లో తానా నిర్వహించిన “సంగీత కోర్సుల” నమోదు కార్యక్రమంలో ఇప్పటికే వందకు పైగా విద్యార్థులు పాల్గొని, ఎంతో ఉత్సాహభరితంగా  లెవెల్ 1 మరియు లెవెల్  2 లో  నమోదయ్యారు.

సంగీతం కొర్సుల వివరాలు:

  • Level 1 – Diploma in Introductory Music
  • Level 2 – Diploma in Music
  • Level 3 – Diploma in Music
  • Level 4 – Advanced Diploma in Music

Ø  ప్రస్తుతం, విద్యార్థులు లెవెల్  1 మరియు లెవెల్ 2 సంగీతం కోర్సుల్లో నమోదు కావచ్చు.

Ø  పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒక్కో లెవెల్ కు 12 క్రెడిట్స్ ఇస్తుంది.

Ø  పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు  అందుకున్న డిప్లొమాలు ఎన్నారై  విద్యార్థులకు అదనపు విద్యా కార్యక్రమంగా భావిస్తారు. అమెరికాలోని కొన్ని  విశ్వవిద్యాలయాలు ఈ క్రెడిట్స్ ను గుర్తించవచ్చు. కాబట్టి, మేము వారు విశ్వవిద్యాలయాల్లో  దరఖాస్తు చేసినప్పుడు వారి సంబంధిత అధికారులతో తనిఖీ చేసుకోవాలని విద్యార్థులను సూచిస్తున్నాము.

Ø విద్యార్థులు ఉత్తర అమెరికాలో ఎక్కడనుంచి అయినా ఏ సంగీత ఉపాధ్యాయుల నుండి సంగీతం నేర్చుకోవచ్చు.

Ø ఈ సంగీత కోర్సుల్లో నమోదుకు కనీస వయసు 10 సంవత్సరాలు  మరియు  విద్యార్థినులు మాత్రమే నమోదు కాగలరు.

Ø  పరీక్షా ఫీజు తో కలిపి ఒక్కో లెవెల్ కు ఫీజు 300 డాలర్లు మాత్రమే.

Ø  లెవెల్ 1, 2 మరియు  3  చివర్లో  విద్యార్థుల  నైపుణ్యత  ను  స్థానికముగా  తానా  నేషనల్  మ్యూజిక్ కోఆర్డినేటర్ మరియు వారి బృందం కలిసి నిర్ణయిస్తారు. లెవెల్ 4కు విశ్వవిద్యాలయ  అధికారులు  వ్యక్తిగతంగా సమీక్షించి థియరీ అండ్ ప్రాక్టికల్  పరీక్షలు  నిర్వహిస్తారు. అర్హత గల   గ్రాడ్యుయేట్  విద్యార్థులకు  డిప్లొమాలను  అమెరికాలో  ఒక  అధికారిక స్నాతకోత్సవం లో బహుకరిస్తారు.

Ø  ప్రతి లెవెల్ లో ఉత్తీర్ణులు అవ్వడానికి కనీసం 45% మార్కులు సాధించాలి.  70 శాతం   సాధిస్తే “డిస్టింక్షన్” గా పరిగణిస్తారు.

Ø నమోదు ఫారం కోసం  www.tana.org  ను  సందర్శించి  పేర్కొన్న  విధంగా  ప్రక్రియను  పూర్తి చేయాలి. మరిన్ని వివరాలకు: www.tana.org ను సందర్శించండి లేదా:

Ø  శ్రీమతి మీనాక్షి అనిపిండి, తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ tanamusiccoordinator@gmail.com

Ø  డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఛైర్మన్- తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్  at 817-300-4747 or tanaieachair@gmail.com

Ø  డాక్టర్ జంపాల చౌదరి, తానా అధ్యక్షులు- 937-475-7809 or president@tana.org

కార్యక్రమం లో తానా ప్రాంతీయ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు, తానా సంయుక్త కోశాధికారి డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.