“నయీమ్ భాయ్” మూవీ ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్

Naeem Bhai Movie Frist Look Poster Launch by Prathani Ramakrishna Goud
Naeem Bhai Movie Frist Look Poster Launch by Prathani Ramakrishna Goud
లక్ష్మి ఫిలిమ్స్ పతాకంపై లక్ష్మి రవి సమర్పణలో ఎన్.టి .నాయుడు నిర్మాతగా ఎల్ .వి .నాయుడు  డాన్ నయీమ్ టైటిల్  పాత్రలో బి .ఆర్ .నాయుడు దర్శకత్వంలో  వస్తున్న చిత్రం “నయీమ్ భాయ్ ” …ఈ చిత్ర ట్రైలర్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ ఫిలింఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేసారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…డాన్ నయీమ్ టైటిల్  పాత్ర కు  ఎల్ .వి .నాయుడు కరెక్టుగా సరిపోయాడని ట్రైలర్  చాలా బాగా ఉందని, ఈ సినిమా కి మంచి క్రేజ్ ఏర్పడుతుందని, ఈ నిర్మాతలు కొత్త వాళ్ళు ఆయినా సినిమా బాగా తీశారు వీళ్లకు నా పూర్తి సహకారం ఉంటుందని,ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర హీరో ఎల్ .వి .నాయుడు మాట్లాడుతూ…నిర్మాతలు అనుకోకుండా నన్ను చూసి నయీమ్ లా ఉన్నవని త్వరలో సినిమా చేస్తున్నామని నన్ను టైటిల్  రోల్  చెయ్యమని అడిగారు. నయీమ్ క్యారెక్టర్ పోషించటం నా మనస్తత్వానికి ఎతిరేకం అయినప్పటి  నటన మీద నాకు ఉన్న గౌరవం కొద్దీ మరియు చెడూ దోవ పడుతున్న యువతకి  మంచి సందేశం వివాలనే ఉదేశ్యం తో ఈ చిత్రం చెయ్యటనికి వప్పుకున్నానని,ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు లభిస్తుందని నమ్మకం ఉందన్నారు .
చిత్ర సమర్పకులు లక్ష్మి రవి మాట్లాడుతూ… ఈ చిత్రంలో  నాలుగు పాటలున్నాయిని, సినిమా బాగా వచ్చిందని,చిత్రం షూటింగ్ పూర్తిఅయిందని,ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటున్నామని,త్వరలో ఆడియో మరియు సినిమాను విడుదల చెస్తాంమన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.