వేడుక చూద్దామంటున్న చైతూ,రకుల్ ప్రీత్

Naga Chaitanya Rakul Preet Raarandoi Veduka Chuddam Theatrical Trailer will out today

Naga Chaitanya Rakul Preet Raarandoi Veduka Chuddam Theatrical Trailer will out today

నాగచైతన్య హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క‌ృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. అదే ఊపుతో ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన థియాట్రికల్‌ ట్రైలర్‌ని రిలీజ్‌ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 26న సమ్మర్‌ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మెడలో బంతిపూల దండ వేసుకుని, ఆ దండ భ్రమరాంబ మెడలో వేయాలని కలలు కంటాడు. మరి, అమ్మాయి మనసులో ఏముంది? మే 19న తెలుస్తుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్‌ కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ ఆ రోజునే విడుదలవుతోంది. ఇందులో శివగా నాగచైతన్య, భ్రమరాంబగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, పథ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని కష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.

Have something to add? Share it in the comments

Your email address will not be published.