కేసీఆర్‌ అవినీతిలో మొనగాడు: నాగం జనార్థన్‌రెడ్డి

Nagam Janardhan reddy slams kcr on various issues in Telangana

Nagam Janardhan reddy slams kcr on various issues in Telangana

గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న నాగర్‌కర్నూలు ముద్దుబిడ్డ డాక్టర్. నాగం జనార్ధన్‌రెడ్డి ఈరోజు ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌ హౌస్‌లో 2 వేల 400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. 50 కోట్ల రూపాయల మోటార్లు 90 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచారని నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్‌ అవినీతిలో మొనగాడని, మోదీతో పోల్చుకునే స్ధాయి కేసీఆర్‌‌కు లేదన్నారు నాగం. రైతులకు కేంద్రం 700 కోట్లు ఇస్తే ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం నీచాతినీచంగా దిగజారారంటూనే గతంలో ఈడీ, విజిలెన్స్‌, సీవీసీలకు కేసీఆర్‌పై ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు నాగం జనార్ధన్‌రెడ్డి.

తెలంగాణ ద్రోహి అయిన కేసీఆర్‌, అమిత్‌షాను అవమానిస్తారా అని నిలదీసిన నాగం, కేసీఆర్‌ ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతి జరుగుతుంటే మోదీతో ఆయనకు పోలికనా అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రక్షణ కావాలంటే రజాకార్లను పెట్టుకుంటారా.. ఫెడరల్‌ స్పూర్తి ఉండకూడదా.. ముస్లింల పేరుతో, కులాల పేరుతో..పందులు.. కుక్కలు నక్కల పేరుతో ఎందుకు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు నాగం జనార్ధన్‌రెడ్డి.

అమిత్‌ షా నాయకత్వంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. తమ జోలికి వస్తే ఖబడ్దార్‌ అని.. ప్రగతి భవన్‌లో చర్చకు సిద్దమైతే కేసీఆర్‌ అవినీతిని నిరూపించడానికి బీజేపీ సిద్దమని నాగం తెలిపారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.