రారండోయ్ వేడుక చూద్దాం అంటున్న చైతూ

Nagarjuna Naga Chaitanya Rakulpreet Jagapathibabu Kalyankrishna are very much confident about Raarandoi VedukaChuddam

టాలీవుడ్ నవమన్మథుడు అక్కినేని నాగార్జున తన సినిమాలపై ద‌స్టి పెడుతూనే తన ఇద్దరు కుమారుల సినిమాలను నిర్మాస్తూనే దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నాడు. నాగచైతన్య హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’.  జగపతిబాబు, సంపత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఒక పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే మూడవ వారంలో ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘ఒక అమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలి అని కలలు కంటుంది. ఆ రాకుమారుడు ఎవరు? ఎలా ఉంటాడు ఆ అమ్మాయి కన్న కల నెరవేరిందా లేదా అనేది చిత్ర కథ. నాకు బాగా నచ్చిన రొమాంటిక్‌ ఫిలింస్‌ నిన్నే పెళ్లాడతా, మన్మధుడు. ఫ్యామిలీ లవ్‌, ఎమోషన్స్‌ సీన్స్‌ ‘నిన్నే పెళ్లాడతా’లో చూపించాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సెన్సిటివ్‌ లవ్‌ని ‘మన్మధుడు’లో చూపించాం. ఆ రెండు మిక్స్‌చేసి సినిమా చేస్తే బాగుంటుందని కళ్యాణ్‌తో చెప్పాను. ఫెంటాస్టిక్‌ సబ్జెక్ట్‌ చెప్పాడు. నేను ఏదైతే అనుకున్నానో కరెక్ట్‌గా ఆ రేంజ్‌లో కథ రెడీ చేశాడు. కథ వినగానే బాగా నచ్చింది. వెరీ హ్యాపీ. అంటున్నారు నిర్మాత నాగార్జున.

ఈ సినిమాలో జగపతిబాబు చైతన్య ఫాదర్‌గా నటించారు. వారిద్దరి మధ్య వచ్చే ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌షిప్‌ ఎలా ఉంటుందో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. రియల్‌ లైఫ్‌లో తను, చైతు ఎలా ఉంటామో ఈ చిత్రంలో జగపతిబాబు- చైతు క్యారెక్టర్స్‌ సేమ్‌ అలాగే ఉంటాయని అలాగే సంపత్‌ కూతురిగా రకుల్‌ నటించిందని చెప్పుకొచ్చారు నాగార్జున

లెజెండ్‌లో యాంగ్రీ సాల్ట్‌ పెప్పర్‌ క్యారెక్టర్‌లో కనిపించిన జగపతిబాబు ఈ చిత్రంలో మోడరన్‌ స్టైలిష్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. రకుల్‌ బ్రమరాంబ క్యారెక్టర్‌లో నటించింది. డిఫరెంట్‌గా చాలా బాగా చేసింది. తెలుగు నేర్చుకుని క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయి బ్యూటిఫుల్‌గా చేసింది. సినిమా చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఈ సినిమాతో రకుల్‌కి చాలా మంచి పేరు వస్తుందన్నారు నాగార్జున.

చైతన్య తన కళ్ల ముందు పెరిగాడని ఫస్ట్‌టైం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వర్క్‌ చేస్తున్నానని చెప్పుకొచ్చారు జగపతిబాబు. చైతన్య, తను కలిసి నటించడం చాలా హ్యాపీగా వుందని, తమ ఇద్దరి మధ్య చిత్రీకరించిన సీన్స్‌ ఫెంటాస్టిక్‌గా వచ్చాయన్నారు. మామూలుగా తనకు ఇరిటేషన్‌ ఎక్కువని, అలాంటిది తనకు ఇరిటేషన్‌ రాకుండా స్మూత్‌గా, కూల్‌గా వర్క్‌ చేశాడుదర్శకుడు కళ్యాణ్‌‌ను మెచ్చుకున్నారు జగపతిబాబు.

‘ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని. బాలెన్స్‌ ఉన్న పాటని నెలాఖరుకు ఫినిష్‌ చేసి మే థర్డ్‌ వీక్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెబుతున్నాడు చైతన్య. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా చేశాక యాక్టర్‌గా నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాలంటే కళ్యాణ్‌కృష్ణతో ఒక సినిమా చేయాలి అనుకున్నానని, కళ్యాణ్‌ మంచి స్క్రిప్ట్‌ రెడీ చేస్తే నాన్న సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారని హ్యాపీగా చెబుతున్నాడు.

‘ఎప్పటి నుంచో ప్యూర్‌ లవ్‌స్టోరీ ఫిలిం చేయాలని వెయిట్‌ చేస్తున్నానని కళ్యాణ్‌ ఈ స్టోరీ నెరేట్‌ చేయగానే బాగా ఎగ్జైట్‌ అయ్యానని చెప్తోంది రకుల్‌ప్రతీత్ సింగ్. ఫ్యామిలీ రిలేషన్స్‌, ఎమోషన్స్‌ ఏవిధంగా ఉంటాయో ఈ మూవీలో క్లియర్‌గా చూపించారని, భ్రమరాంబ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయి నటించానని తెలియచేసింది రకుల్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.