శమంతకమణి వేటలో బాలయ్య

Nandamuri Balakrishna attending Shamanthakamani Pre release Event

గౌతమీపుత్ర శాతకర్ణితో వందో సినిమా పూర్తి చేసుకొని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న నూటా ఒకటో చిత్రం పైసా వసూల్. ఇటీవలే విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌కి తిరిగివచ్చిన బాలయ్య ఇప్పుడు శమంతకమణి వేటలో ఉన్నారట.

Nandamuri Balakrishna attending Shamanthakamani Pre release Event

నలుగురు హీరోలు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా శమంతకమణి. నారా రోహిత్‌, సందీప్‌ కిషన్‌, సుధీర్‌బాబు, ఆది నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భవ్యక్రియేషన్స్ బ్యానర్‌లో పూరీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న పైసా వసూల్‌ కూడా భవ్య క్రియేషన్సే నిర్మిస్తుండడంతో ఈనెల 3న జరగబోయే ఈ సినిమా ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి నందమూరి నటసింహం బాలకృష్ణ హాజరుకానున్నారు.

Shamanthakamani A Multi starer ready to release on July 14th

తాజాగా విడుదలైన చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తుండడం, ముఖ్యంగా రాజేంద్రప్రసాద్‌ సంభాషణలు ఆకట్టుకుంటోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 5కోట్ల విలువైన ఓ కారు కోసం నలుగురు యువకులు ఏం చేశారన్నదే ‘శమంతకమణి’ ద్వారా చూపించబోతున్నారు శ్రీరామ్‌ ఆదిత్య. మరోవైపు బాలయ్య సినిమా పైసా వసూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని ఆగస్టులో విడుదల చేసేలా భవ్య క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది.

See Also: జులై 14న రానున్న’శమంతకమణి’

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.