“బాలకృష్ణ” నిజమైన హీరో అంటున్న చంద్రబాబు

Nandamuri Balakrishna is a real life hero not only a cinema hero says Chandrababu

Nandamuri Balakrishna is a real life hero not only a cinema hero says Chandrababu

నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే  కాకుండా నిజజీవితంలో కూడా నిజమైన హీరో అని కొనియాడారు ఎపి సీఎం చంద్రబాబునాయుడు. హైద్రాబాద్‌లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో  పేదరోగుల విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన  కార్యక్రమంలో  పాల్గొని ప్రసంగించారు.
బసవతారకం ట్రస్ట్ మోడల్స్‌లో హాస్పిటళ్ళు, యూనివర్సిటీలు వస్తే చాలావరకు నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. కమర్షియల్ హాస్పిటల్స్‌ వల్ల ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువగా జరుగుతుందన్నారు చంద్రబాబు. అంతేగాక తన అత్తగారికోరిక మేరకే ఎన్టీఆర్‌ బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి ప్రారంభానికి పూనుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం కేన్సర్‌తో బాధపడ్డారని.. అప్పట్లో ముంబయి, చెన్నై నగరాలకు తీసుకెళ్లి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదన్నారు చంద్రబాబు.
బాలకృష్ణ అంకితభావంతో ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్న చంద్రబాబు బాలకృష్ణ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ పేదల ప్రాణాలు కాపాడే హీరో అని మెచ్చుకున్నారు. బసవతారకం ఆస్పత్రి కోసం తనతో పాటు అనేక మంది ఎన్నారైలు, తెలుగు పెద్దలు సహకారం అందించారన్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.