ఇంతలో ఎన్నెన్ని వింతలో రెడీ

Nandu Inthalo Ennenni Vinthalo Movie releasing on May 26th

Nandu Inthalo Ennenni Vinthalo Movie releasing on May 26th

టాలెంటెడ్ హీరో నందు నటించిన రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇంతలో ఎన్నెని వింతలో విడుదలకి ముస్తాబవుతోంది. హరి హర చలన చిత్ర పతాకం పై తెరకెక్కిన ఈ సినిమాతో వి.వి.వినాయక్ శిష్యుడు వరప్రసాద్ వరికూటి దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహం తో చిత్రాన్ని కూడా మే 26న విడుదల చేసి సక్సెస్ అందుకుంటామని దర్శకనిర్మాతలు అంటున్నారు.. ఇప్పటివరకు టాలీవుడ్ లో రాని ఓ ఢిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందినట్లుగా చిత్ర బృందం తెలిపింది.

నూతన దర్శకుడు అయినప్పటికి వరప్రసాద్ ఈ సినిమాని ప్రేక్షకుల్ని అలరించే రీతన తీర్చిదిద్దనట్లు యూనిట్ సభ్యలు చెబుతున్నారు. వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరో నందుతో పాటు స్వామిరారా ఫేమ్ పూజారామచంద్రన్ కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

సాధ్యమైనంత త్వరగా వాటిని ముగించి ఈ మండు వేసవిలోప్రేక్షకుల్ని హాయిగా అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా దర్శకుడు వరప్రసాద్ తెలిపారు.  

Have something to add? Share it in the comments

Your email address will not be published.