సవాళ్ళు- ప్రతి సవాళ్ళతో హీటెక్కుతున్న నంద్యాల

Nandyal By poll Challenges between Akhilapriya and Shilpa Mohan Reddy

నంద్యాల ఉపఎన్నిక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలను గుర్తుచేస్తోంది. రాష్ట్రం మొత్తం చల్లగా ఉంటే నంద్యాల వేడి మాత్రం అన్ని రాజకీయపార్టీలకు తగులుతోంది. ముఖ్యంగా ఏకగ్రీవం అవుతుందనుకున్న స్థానంలో టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను నిలబెట్టడంతో సవాళ్ళు , ప్రతి సవాళ్ళతో రాజకీయం రసకందాయంలో పడింది.

Nandyal By poll Challenges between Akhila priya and Shilpa

టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. అయితే సంప్రదాయానికి విరుద్ధంగా రెండు రాజకీయపక్షాలు పంతానికి పోయి అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పుడు అక్కడ జరిగే ఎన్నికలు ఇద్దరు అభ్యర్థుల మ‌ధ్య కాకుండా రెండు పార్టీల అధినేత‌ల మ‌ధ్య యుద్దానికి తెరలేపింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోయినప్పుడు జరిగే ఉపఎన్నికలకు సంబంధించి రాజకీయపార్టీలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దాఖలాలు ఏమాత్రంలేవు. అయితే చనిపోయిన భూమా నాగిరెడ్డి వైసీపీ గుర్తుపై గెలిచి సైకిలెక్కడం, ఆ తర్వాత ఆయన కూతురు భూమా అఖిలప్రియకు మంత్రి పదవి కట్టబెట్టడంతో ఇప్పుడు జరుగబోయే ఉపఎన్నికకు ప్రాధాన్యత పెరిగింది. దానికితోడు టీడీపీ తరుపున 2014 ఎన్నికల్లో భూమాకు పోటీగా టీడీపీ తరుపున నిలబడ్డ శిల్పా మోహన్‌రెడ్డికి సీటు ఇచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఆయన జగన్‌ గూటికి చేరుకొని అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో నంద్యాలలో గెలవటం ఇపుడు రెండు పార్టీలకు ఇజ్జ‌త్‌కా స‌వాల్‌గా మారింది.

See Also: నేనిష్టంలేకపోతే నేను మీకెందుకు పనిచెయ్యాలి???

అధికార-ప్రతిపక్షాలు రెండూ తమ అభ్యర్ధులను ప్రకటించేయటంతో నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా అంతటా ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది.భూమా మరణించిన‌ప్ప‌టినుండి రాష్ట్ర రాజ‌కీయాలు నంద్యాల చుట్టూనే తిరుగుతున్నాయి. అందుకే రాష్ట్రంలోని ప్రజలదంరి ద‌ృష్టి నంద్యాల ఉపఎన్నికపైనే ఉంది. టిడిపి తరపున భూమా బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించగా ఆదివారం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా శిల్పామోహన్‌రెడ్డి పేరుని ప్రకటించారు. డ‌బ్బుకంటే ఇప్పుడు సెంటిమెంట్ అభ్యర్థులకు నంద్యాల ఉపఎన్నికలో ప్ర‌ధాన అస్త్రంగా మారింది. దీంతో ఎన్నికల నోటిఫికేష‌న్ రాక‌ముందే ఉప ఎన్నిక పోరు తీవ్ర‌తరమైంది.

See Also: అసలైన ఆట మొదలైంది

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే సవాళ్ళు ప్రతిసవాళ్ళు మొదలయ్యాయి. ఏక‌గ్రీవ‌ం చేయడానికి చేసిన ప్ర‌య‌త్నాలు విఫలంకావడంతో సవాళ్ళు మొదలయ్యాయి. నంద్యాల‌ ఉపఎన్నికలో ఓడిపోతే తన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసురుతోంది మంత్రి అఖిలప్రియ. నంద్యాల ప్ర‌జ‌లు భూమా ఫ్యామిలీని గెలిపించేందుకు ఎదురు చూస్తున్నార‌ని భూమా పేరు చెప్పి సెంటిమెంట్‌ను రాజేసేందుకు అఖిలప్రియ తెగ ట్రై చేస్తున్నారు. అంతేగాక వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కూడా ఇప్పుడు అదే సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతారని సవాల్ విసురుతోంది అఖిలప్రియ.

See Also: చంద్ర’బాబా’ మజాకా???

అఖిలప్రియ స‌వాల్‌కు వైసీపీ అభ్య‌ర్థి శిల్పామోహ‌న్‌రెడ్డి కూడా అంతే రీతిలో స్పందించారు. స‌వాల్‌ను స్తీకరిస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన శిల్పా ఉపఎన్నికలో ఓడిపోతే తాను రాజకీయాలను వదిలేస్తానని కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ప్రతిసవాల్ విసిరారు. వైసీపీతో ఉంటేనే భవిష్యత్తు ఉంటుదన్న నమ్మకం, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల భరోసాతోనే తాను పార్టీలో చేరానని అన్నారు.

మొత్తానికి నంద్యాల ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారబోతోంది. ఒకపార్టీ గుర్తుపై గెలిచి మరోపార్టీలోకి వెళ్ళిన ఫ్యామిలీ ఒకవైపు… గత ఎన్నికల్లో ఒకపార్టీ గుర్తుపై పోటీచేసి ఇప్పుడు అదే పార్టీకి పోటీగా నిలబడ్డ ఫ్యామిలీ మరోవైపు ఉండడంతో ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

See Also: నిజం ఇప్పుడైనా బయటికొస్తుందా??

Have something to add? Share it in the comments

Your email address will not be published.