‘నిన్నుకోరి’ టీజర్: అమ్మాయిల్ని అలా అనేశాడేంటి??

Nani Comments on Girls in Ninnu Kori Telugu Movie Teaser

Nani Comments on Girls in Ninnu Kori Telugu Movie Teaser

హీరో నాని సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఎక్కడాలేని ఎనర్జీ పుట్టుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్నాకడా ఓవరాక్షన్‌లేని నటన, సెటైర్లు, భావోద్వేగమైన డైలాగ్స్, పంచ్‌లు అన్నింటికి మించి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ. అందుకే నాని సినిమాకి క్రేజ్‌ ముహూర్తపు షాట్ నుండి ఉంటుంది. ప్రతీ సినిమాలో అందరినీ ఆలోచింపచేసూ డైలాగ్స్ ఉంటుండడంతో నాని సినిమాల్లో డైలాగ్స్‌కి ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. నాని, ఆది పినిశెట్టి, నివేథా థామస్‌లు లీడ్ రోల్స్ చేస్తున్న  లేటెస్ట్‌ మూవీ ‘నిన్నుకోరి’. ఈ సినిమా టీజర్ రిలీజై సోషల్‌మీడియాలో ఫుల్‌గా చక్కర్లు కొడ్తోంది.

‘ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ, అన్ని అలవాట్లు ఉన్న వాళ్లను ప్రేమిస్తారు, ఏ అలవాట్లు లేని వాళ్లను పెళ్లి చేసుకుంటారంటూ’ అంటూ నాని చెప్పే డైలాగ్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో చెప్పకనే చెప్పేశాడు ఈ మూవీకి కొత్త దర్శకుడు శివ నిర్వాణ. నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ‘అడిగా అడిగా ఎదలో లయ నడిగా’ సింగిల్ ట్రాక్‌ సాంగ్‌తో పిండేసిన నాని.. టీజర్‌తో ఇదో లవ్ ఫెయిల్యూర్ మూవీ అంటూ తేల్చేశాడు.

కారులో వెళ్తున్న నివేథా థామస్, నాని, ఆదిపినిశెట్టిలకు నాని బ్యాగ్రౌండ్ వాయిస్‌కు తోడుగా రిచ్ సినిమాటోగ్రఫీ టీజర్‌ లెవల్‌ని పెంచేసింది. ఇక గోపిసుందర్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ టీజర్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గాఉంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ జూలై 8న థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీగా ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.