తిరుమలలో దేవాన్ష్ అక్షరాభ్యాసం

Nara Devansh Aksharabhyasam done at Tirumala today

Nara Devansh Aksharabhyasam done at Tirumala today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ అక్షరాభ్యాసం తిరుమలలో వైభవంగా జరిగింది. పద్మావతి గెస్ట్‌హౌజ్‌లో దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం చేయించారు చంద్రబాబు, నారా లోకేష్ దంపతులు. ఆ తర్వాత చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి వైకుంఠం 1 మీదుగా క్యూలైన్లో ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుని మండపంలో పండితులు వేదాశీస్సులు అందించగా తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వారికి ప్రసాదం అందజేసి సత్కరించారు. దేవాన్ష్‌ చేత నూతన సంప్రదాయానికి అంకురార్పణ చేయించామన్నారు చంద్రబాబు.

అ… అంటే అమ్మ, ఆ… అంటే ఆంధ్రప్రదేశ్‌… అ… అంటే అమరావతి, ఆ… అంటే ఆనందం, ఆరోగ్యం, ఆదాయం అని… దేవాన్ష్‌తో రాయించారు చంద్రబాబు దంపతులు. నూతన రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రాన్ని సంపద ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు చంద్రబాబు. టిటిడి అధికారులు ఎంతో శ్రద్ధాభక్తులతో భక్తులకు సేవలందిస్తున్నారని, శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నారని కొనియాడారు. శాస్త్రవేత్తలు సైతం శ్రీవారిని దర్శించుకున్న అనంతరమే ప్రయోగాలు చేస్తున్నారని, స్వామివారి ఆశీస్సులతోనే విజయం చేకూరుతుందని వారు విశ్వసిస్తున్నారని తెలిపారు సీఎం చంద్రబాబు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.