బాబూ చిట్టీ: నువ్వు ఇంత బాగా మాట్లాడుతావా..!

Nara Lokesh attracts with his speech at East Godavari District while participating in Official engagements
Nara Lokesh attracts with his speech at East Godavari District while participating in Official engagements

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదో ఒక సందర్భంలో నోరు జారి, మాటతడబడి సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిన నారా లోకేశ్ తూర్పు గోదావరి జిల్లాలో అందరినీ ఆకట్టుకొనేలా ప్రసంగించారు. లోకేశ్ బాబు ఇంత బాగా మాట్లాడగలుగుతాడా అనే విధంగా మాట్లాడి అందరినీ విస్మయానికి గురిచేశాడు. తూర్పు గోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ తను పట్టుబట్టి పంచాయతీరాజ్ శాఖను ఎందుకు తీసుకున్నాడో వివరించాడు.

‘పల్లె తల్లి లాంటిది.. పట్నం ప్రియురాలు లాంటిది.. పల్లె ఆప్యాయతగా రమ్మంటుంది.. పట్నం తెమ్మంటుంద’ని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తూ.గో జిల్లాలో పర్యటించిన ఆయన సామర్లకోట మండలం మేడపాడులో చెత్తనుండి సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తర్వాత భూగర్భ డ్రెయిన్‌కు శంకుస్థాపన చేశారు. పెద్దాపురం మండలం కట్టమూరులో సమగ్ర మంచినీటి పథకానికి కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పల్లె తల్లి లాంటిది.. పట్నం ప్రియురాలు లాంటిది, పల్లె ఆప్యాయతగా రమ్మంటుంది.. పట్నం తెమ్మంటుంది’. ఎండాకాలం సెలవుల్లో తప్పితే ఎప్పుడూ పల్లెటూరికి వెళ్లింది లేదన్నారు. ఎండాకాలంలో తప్ప అక్కడ పెరిగిందీ లేదు.. సరిగ్గా చూసింది లేదని లోకేశ్ చెప్పారు. చిన్నప్పుడు పల్లెటూరికి దూరంగా హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌‌లో చదవుకున్నానని అన్నారు.

పల్లెటూరి సమస్యలు అర్థం చేసుకోకుండా వాటిని పరిష్కరించకుండా ఎవ్వరూ రాజకీయాల్లో రాణించలేరన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబును పదేపదే అడిగి మరీ.. పంచాయతీరాజ్‌శాఖ తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఐటీ ద్వారా రెండేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఓ దొంగ న్యూస్ పేపర్ చదవడం స్మోకింగ్ చేయడం కంటే ప్రమాదం అని, రాయలసీమ, గోదావరి జిల్లాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని చూశారన్నారు. నాకు, మా నాన్న, చినరాజప్ప మధ్య విబేధాలు ఉన్నాయని ఆ దొంగ న్యూస్ పేపర్ తప్పుడు వార్తలు రాసిందంటూ మంత్రి మండిపడ్డారు.

రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్న యువతీ యువకులకు స్థానికంగా లేదా జిల్లాలోగానీ ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుంటోందని లోకేశ్ హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.