పూర్తయిన ‘యువరాజు’ పట్టాభిషేకం

Nara Lokesh became Cabinet Minister in Chandrababu Government

Nara Lokesh became Cabinet Minister in Chandrababu Government

యువరాజు పట్టాభిషేకం ముగిసింది. 2014 ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటినుండి ఎదురుచూస్తున్న చంద్రబాబు కల నేటితో నెరవేరింది. ఇది కేవలం చంద్రబాబు కల మాత్రమే కాదు చాలామంది పసుపు తమ్ముళ్ళ కల. అందుకే ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత క్యాబినెట్‌లోకి లాంఛనంగా తీసుకున్నారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. 2019 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ప్రస్తుత మంత్రుల్లో ఐదుగురిని తొలగించి.. కేబినెట్‌లో యవరక్తానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు మొత్తం కొత్తగా 11 మందిని తీసుకున్నారు. ఉదయం వెలగపూడిలో  గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కొత్త క్యాబినెట్‌లో  సీఎంతో సహా  మొత్తం మంత్రుల సంఖ్య 26కు చేరింది.

టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులుకు చంద్రబాబు కేబినెట్‌లో బెర్తులు దక్కాయి. అంతేగాక అందరూ ఊహించినట్టుగానే చంద్రబాబు కొడుకు నారా లోకేశ్‌కు మంత్రి పదవి దక్కింది. వీళ్ళతో పాటు నక్కా ఆనంద్‌బాబు, పితాని సత్యనారాయణ, కొత్తపల్లి జవహర్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఇక చంద్రబాబు మంత్రివర్గ విస్తరణలో వైసీపీ నుండి వచ్చిన జంప్ జిలీనీలకు  పెద్దపీట వేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో పాటు అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావులకు మంత్రి పదవులు దక్కాయి. అయితే క్యాబినెట్‌లోకి కొత్తగా 11మంది కొత్తవాళ్ళు చేరడంతో  మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఉద్వాసనకు గురైన మంత్రులు:

కిమిడి మృణాళిని
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
పీతల సుజాత
రావెల కిషోర్‌బాబు
పల్లె రఘునాథ్‌రెడ్డి

కొత్త మంత్రులు వీళ్లే..

1.కిమిడి కళావెంకట్రావు (ఎమ్మెల్సీ)

2. నారా లోకేశ్‌ (ఎమ్మెల్సీ)
3. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
4. నక్కా ఆనంద్‌బాబు (ఎమ్మెల్యే)
5. పితాని సత్యనారాయణ (ఎమ్మెల్యే)
6. కొత్తపల్లి జవహర్‌ (ఎమ్మెల్యే)
7. కాల్వ శ్రీనివాసులు (ఎమ్మెల్యే)
8. భూమా అఖిలప్రియ (ఎమ్మెల్యే)
9. అమర్‌నాథ్‌రెడ్డి (ఎమ్మెల్యే)
10 ఆదినారాయణరెడ్డి (ఎమ్మెల్యే)
11. సుజయకృష్ణ రంగారావు (ఎమ్మెల్యే)

 జిల్లాల వారీగా మంత్రుల జాబితా ఇదే..

శ్రీకాకుళం: అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు
విజయనగరం: సంజయ్‌ కృష్ణ రంగారావు
విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు
తూర్పుగోదావరి: యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప
పశ్చిమగోదావరి: కేఎస్‌. జవహర్‌, పితాని సత్యనారాయణ, మాణిక్యాలరావు
కృష్ణా: కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర
గుంటూరు: ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు
ప్రకాశం: సిద్ధా రాఘవరావు
నెల్లూరు: నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కడప: ఆదినారాయణరెడ్డి
కర్నూలు: కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ
అనంతపురం: పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు
చిత్తూరు: నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, అమర్‌నాథ్‌ రెడ్డి

Have something to add? Share it in the comments

Your email address will not be published.