ఎమ్మెల్సీగా నారా లోకేష్ నామినేషన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీకార్యదర్శికి నామినేషన్‌ పత్రాలు ఆయన అందజేశారు. నారా లోకేష్‌ వెంట హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. లోకేష్ అభ్యర్ధిత్వాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రతిపాదించించారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు బలపరిచారు. లోకేష్‌తో పాటుగా ఎమ్మెల్యే కోటాలో  బచ్చుల అర్జునుడు(కృష్ణా జిల్లా), కరణం బలరాం( ప్రకాశం జిల్లా), పోతుల సునీత(ప్రకాశం జిల్లా), డొక్కా మాణిక్యవరప్రసాద్‌(గుంటూరు) టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ వేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు మంగళవారంతో ముగియనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.