చినబాబులో ఎంతమార్పు??

Nara Lokesh Sensational comments in Pileru Meeting

ఒక మనిషి మనీషిగా మారడానికి చాలాకాలం పడుతుంది. అయితే కొంతమంది విషయంలో మాత్రం ఎక్కువకాలం పట్టదు. బహిరంగసభల్లో తన మాటలతో సోషల్‌మీడియాకు టార్గెట్ అయిన చినబాబులో చాలా మార్పు వచ్చేసింది. ఈమధ్య ఆయన ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నారు.

Nara Lokesh Sensational comments in Pileru Meeting

ఏపీ మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా మదనపల్లి, చర్లోపల్లి, రంగంపేట, పీలేరు, కలకడ, మహల్, కలికిరి, సోమల చౌడేపల్లిలో లోకేష్ పర్యటిస్తున్నారు. మదనపల్లి పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఆర్.టి.ఓ ఆఫీస్ వద్ద మంత్రి నారా లోకేష్ 90లక్షల రూపాయల అంచనా వ్యయంతో తిరుపతి రోడ్ ఆర్.టి.ఓ ఆఫీసు నుండి కోటపల్లి వరకు తారురోడు నిర్మాణానికి శంకుస్థాపనకు స్థాపన చేశారు.
అనంతరం పీలేరులో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో నారా లోకేష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లోకేష్ మాట్లాడుతూ “చిన్న వయసులో వెంకటేశ్వరస్వామి, ముఖ్యమంత్రిగారి ఆశీస్సులతో పల్లెలకు సేవ చేసే మంచి శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టడం నా అదృష్టం. పల్లెలకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లే. రాష్ట్రం విడిపోయినప్పటికి 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 24వేల కోట్లతో రైతు రుణమాఫీని, 10వేల కోట్లతో డ్వాక్రా మహిళల రుణమాఫీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేశారు.
అంతేగాక రాష్ట్రంలో నిరంతర విద్యుత్ ఇస్తున్నాము. ఉపాధి హామీ కూలీల వేతనాన్ని పెంచాము. త్రాగునీటి సమస్య తక్షణ పరిష్కారం కోసం జలవాణి కాల్ సెంటర్ పెట్టాము. త్రాగునీటి కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి 2019 లోపు ఇంటింటికి త్రాగునీటి కుళాయి ఇస్తాము. 5వేల కోట్లతో కేంద్రప్రభుత్వం సహకారంతో లింక్ రోడ్లు ఇస్తాము. ఉపాధిహామీ కింద 2019 లోపు అన్ని గ్రామాలకు త్రాగునీరు, సిసి రోడ్స్,అంగన్వాడీ భవనాలు, డ్రైనేజీలు, ఎల్ ఈ డి బల్బులను, 5వేల జనాభా దాటితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తాము. తిరుపతిలో వచ్చే సంవత్సరం లోపు సెల్‌కాన్ పరిశ్రమ ద్వారా లక్ష ఉద్యోగాల కల్పన చేయాలని నిర్ణయించాం. అంతేగాక పీలేరు సమస్యల పరిష్కారానికి క‌‌ృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి..అందరూ సహకరించండి” అంటూ ముగించారు.

పరిశ్రమల శాఖా మంత్రి ఎన్.అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ “ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 634 కోట్లతో 42000 ల ఎన్టీఆర్ గృహాలను రెండు సంవత్సరాలలో నిర్మిస్తున్నాము. ప్రతి ఇంటికి 1.50 లక్షల రాయితీని ఇస్తున్నాము. పీలేరు నియోజకవర్గ పరిధిలో 33 కోట్లతో 2200 గృహాలకు మంత్రి నారా లోకేష్ శంఖుస్థాపన చేయడం అదృష్టం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ , నిరుపేదల ప్రజల సంక్షేమం కోసం వేల కోట్లతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాము. ప్రతి గ్రామంలో సిసి రోడ్స్, ఎల్ ఈ డి బల్బులను, డ్రైన్స్‌ను నిర్మించి గ్రామాల అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని జడ్పీ చైర్మన్ గీర్వాణి పేర్కొన్నారు.

See Also: ఒక్క అంగుళం భూమి కూడా పోనివ్వం

Have something to add? Share it in the comments

Your email address will not be published.