కేశినేనికి లోకేష్ క్లాస్

nara-lokesh-serious-on-vijayawada-mp-kesineni-nani-over-comments-on-rta-officers-issue

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే విజయవాడ ఎంపీ కేశినేని నానికి అరుణాచల్‌ప్రదేశ్ బస్సుల విషయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టిగా క్లాస్ పీకారు. అరుణాచల్‌ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు వెయ్యి బస్సుల అనుమతులను రద్దు చేసిన తర్వాత కేశినేని నాని ఆర్టీఎ అధికారులపై చేసిన వ్యాఖ్యలను లోకేష్ సీరియస్‌గా తీసుకున్నారు.

nara-lokesh-serious-on-vijayawada-mp-kesineni-nani-over-comments-on-rta-officers-issue

విదేశీ పర్యటనలో ఉన్న లోకేష్ ఎంపీ కేశినేని నానికి ఫోన్ చేసి మాట్లాడారు. బస్సుల వివాదంపై ఎవరితో మాట్లాడవద్దని ఆదేశించిన లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వారించారు.

అంతేగాక విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదామన్న లోకేష్‌కు నిన్న, ఈరోజు చేసిన వ్యాఖ్యల గురించి నాని వివరించారు. తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు, మీరూ ముఖ్యమని లోకేష్ కు చెప్పిన నాని ఈ విషయంలో ఇక మాట్లాడనని హామీ ఇచ్చారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.