నేడే లోకేశ్ ప్రమాణస్వీకారం

Nara Lokesh sworn as cabinet minister in today

Nara Lokesh sworn as cabinet minister in today

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో కొత్తగా చేరే వారి పేర్లను ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన కుమారు లోకేశ్, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. కొత్తగా 11 మంది చోటు కల్పించాలని భావిస్తున్నారు. వీరిలో 5గురు వైఎస్ ఆర్ సీపీనుంచి ఫిరాయించి టీడీపీలోకి చేరివారు. అదే విధంగా మంత్రి వర్గంలో నుండి 5 మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అందులో పీతల సుజాత, బోజ్జల గోపాలకృష్ణ, మృణాలిని, రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాధరెడ్డి మంత్రుల పేర్లు వినబడుతున్నాయి.

ఆదివారం ఉదయం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేవాళ్లలో ఈ కింది వారు ఉండవచ్చు:

చిత్తూరు నుంచి నారా లోకేశ్

శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు

కడప నుంచి ఆదినారాయణ రెడ్డి

విజయనగరం నుంచి సుజయ కృష్ణారంగ రావు

ప.గో. జిల్లా నుంచి జవహర్, పితాని సత్యనారాయణ

గుంటూరు నుంచి నక్కా ఆనంద్ బాబు

నెల్లూరు నుంచి సొమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

చిత్తూరు నుంచి అమర్ నాథ్ రెడ్డి

కర్నూలు నుంచి భూమా అఖిల ప్రియ

అనంతరపురం నుంచి కాల్వ శ్రీనివాసులు,

చివరి నిమిషమంలో చాంద్ బాషను మార్పుచేసి ఆ స్థానంలో పితాని సత్యనారాయణకు మంత్రి పదవిని ఇస్తారని ప్రచారం జరగుతోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.