బాధ్యతలు స్వీకరించిన “యువరాజు”

Nara Lokesh Takes Charge as Andhra Pradesh IT Minister in Secretariat today morning
Nara Lokesh Takes Charge as Andhra Pradesh IT Minister in Secretariat today morning
మంత్రివర్గ విస్తరణ తర్వాత  ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా యువరాజు బాధ్యతలు స్వీకరించారు. ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయం ఐదో బ్లాక్‌‌లో నారా లోకేష్ ఆయన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డాలర్‌ శేషాద్, జేఈవో శ్రీనివాసరాజు లోకేష్‌కు శాలువా కప్పి వెంకన్నతీర్థ ప్రసాదాలు అందించారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడు ఫైల్స్‌పై సంతకాలు చేశారు లోకేష్. ఏడాదిలో 50 రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించే ఫైల్‌పై లోకేశ్‌ తొలి సంతకం చేశారు. ఆ తర్వాత పంచాయతీరాజ్‌ ద్వారా గ్రామాల్లో సాలిడ్ వేస్టేజ్ మెయింటనెన్స్ ఫైల్‌పై సంతకాలు చేశారు లోకేశ్. ఆ తర్వాత గ్రామాల్లో తండాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేస్తూనే రాబోయే రెండేళ్ళలో రాష్ట్్రంలోని అన్ని గ్రామాల అభివ‌ద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు లోకేశ్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.